11 వాళ్లు మిమ్మల్ని అప్పగించడానికి తీసుకెళ్తున్నప్పుడు, ఏమి మాట్లాడాలా అని ముందే ఆందోళన పడకండి; ఆ సమయంలో మీకు ఏమి అనుగ్రహించబడితే అదే మాట్లాడండి, ఎందుకంటే మాట్లాడేది మీరు కాదు పవిత్రశక్తి.+
14 కాబట్టి వాళ్లకు ఎలా జవాబివ్వాలో ముందే ఆలోచించి పెట్టుకోకూడదని మీ హృదయాల్లో నిశ్చయించుకోండి. 15 మీ వ్యతిరేకులందరు కలిసినా ఎదిరించలేని, తిప్పికొట్టలేని తెలివిని, మాటల్ని నేను మీకు ఇస్తాను.+