-
మత్తయి 27:46-49పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
46 దాదాపు మూడింటికి యేసు బిగ్గరగా “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ?” అని అన్నాడు. ఆ మాటలకు “నా దేవా, నా దేవా, నన్నెందుకు విడిచిపెట్టావు?” అని అర్థం.+ 47 అక్కడ నిలబడి ఉన్నవాళ్లలో కొందరు అది విని, “ఇతను ఏలీయాను పిలుస్తున్నాడు” అన్నారు.+ 48 వెంటనే వాళ్లలో ఒకతను పరుగెత్తుకెళ్లి, ఒక స్పాంజీని తీసుకొని పుల్లటి ద్రాక్షారసంలో ముంచి, ఒక కర్రకు తగిలించి తాగడానికి ఆయనకు ఇచ్చాడు.+ 49 కానీ మిగతావాళ్లు ఇలా అన్నారు: “ఉండండి! అతన్ని రక్షించడానికి ఏలీయా వస్తాడేమో చూద్దాం.”
-