శుక్రవారం, ఏప్రిల్ 10
“వాళ్లందరూ ఐక్యంగా ఉండాలని . . . ప్రార్థిస్తున్నాను.”—యోహా. 17:21.
యేసు తన అపొస్తలులతో కలిసి చివరిసారి భోజనం చేసినప్పుడు ఐక్యత గురించి ఎంతో ఆలోచించాడు. ఆయన, తన తండ్రితో ఐక్యంగా ఉన్నట్లే శిష్యులందరూ కూడా ఐక్యంగా ఉండాలనే తన కోరికను వాళ్లతో కలిసి చేసిన ప్రార్థనలో యేసు తెలియజేశాడు. (యోహా. 17:20, 21) యేసును భూమ్మీదకు పంపించింది యెహోవాయేనని అందరికీ స్పష్టంగా తెలియాలంటే శిష్యులు ఐక్యంగా ఉండాలి. వాళ్లు చూపించుకునే ప్రేమను బట్టి యేసు నిజ శిష్యులు ఎవరో ప్రజలు గుర్తించగలుగుతారు. అంతేకాదు ఆ ప్రేమే శిష్యుల్ని మరింత ఐక్యం చేస్తుంది. (యోహా. 13:34, 35) ఆ రాత్రి ఐక్యత గురించి యేసు చాలాసేపు మాట్లాడాడు ఎందుకంటే తన అపొస్తలుల మధ్య కొంతమేరకు ఐక్యత లోపించిందని ఆయన గుర్తించాడు. ఉదాహరణకు, “తమలో ఎవరు అందరికన్నా గొప్ప అనే విషయం గురించి” వాళ్లు మళ్లీ గొడవపడ్డారు. (లూకా 22:24-27; మార్కు 9:33, 34) మరో సందర్భంలో యాకోబు, యోహానులు యేసు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో తమకు ముఖ్యమైన స్థానాలు అంటే ఆయన పక్కన కూర్చునే స్థానాలు కావాలని అడిగారు.—మార్కు 10:35-40. w18.06 8 ¶1-2
జ్ఞాపకార్థ ఆచరణ కోసం బైబిలు పఠనం: (పగటిపూట జరిగిన సంఘటనలు: నీసాను 16) మార్కు 16:2-8
ఏప్రిల్ 6-12
2020, ఏప్రిల్ 7, మంగళవారం—క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ
ప్రతీ సంవత్సరం జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో, చాలామంది క్రైస్తవులు యెహోవా దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు చూపించిన సాటిలేని ప్రేమ గురించి ధ్యానిస్తారు. (యోహా 3:16; 15:13) యెరూషలేములో యేసు చేసిన చివరి పరిచర్య గురించి సువార్త పుస్తకాలు ఏం చెప్తున్నాయో మీరు ఈ చార్టును ఉపయోగించి పరిశీలించవచ్చు. యేసే మార్గం, సత్యం, జీవం పుస్తకంలోని 6వ భాగంలో ఆ సంఘటనల గురించి ఉంది. దేవుడు, క్రీస్తు చూపించిన ప్రేమ మీరు ఏం చేసేలా పురికొల్పుతుంది?—2కొ 5:14, 15; 1యో 4:16, 19.
యెరూషలేములో యేసు చివరి పరిచర్య
సమయం |
స్థలం |
సంఘటన |
మత్తయి |
మార్కు |
లూకా |
యోహాను |
---|---|---|---|---|---|---|
33, నీసాను 8 (ఏప్రిల్ 1-2, 2020) |
బేతనియ |
పస్కాకు ఆరు రోజుల ముందు యేసు వచ్చాడు |
||||
నీసాను 9 (ఏప్రిల్ 2-3, 2020) |
బేతనియ |
మరియ యేసు తలమీద, పాదాలమీద పరిమళ తైలం పోసింది |
||||
బేతనియ-బేత్పగే-యెరూషలేము |
జయజయ ధ్వనుల మధ్య గాడిద మీద యెరూషలేముకు వచ్చాడు |
|||||
నీసాను 10 (ఏప్రిల్ 3-4, 2020) |
బేతనియ-యెరూషలేము |
అంజూర చెట్టును శపించాడు; ఆలయాన్ని ఇంకోసారి శుభ్రం చేశాడు |
||||
యెరూషలేము |
యేసును చంపడానికి ముఖ్య యాజకుల, శాస్త్రుల కుట్ర |
|||||
యెహోవా మాట్లాడాడు; యేసు తన మరణాన్ని ప్రవచించాడు; యూదులు నమ్మకపోవడం యెషయా ప్రవచనాన్ని నెరవేర్చింది |
||||||
నీసాను 11 (ఏప్రిల్ 4-5, 2020) |
బేతనియ-యెరూషలేము |
ఎండిపోయిన అంజూర చెట్టు నుండి పాఠం |
||||
యెరూషలేము, ఆలయం |
ఆయన అధికారాన్ని ప్రశ్నించారు; ఇద్దరు కుమారుల ఉదాహరణ |
|||||
ఉదాహరణలు: హంతకులైన రైతులు, వివాహ విందు |
||||||
పునరుత్థానం, దేవుడు-కైసరు, అతి ముఖ్యమైన ఆజ్ఞ గురించిన ప్రశ్నలకు జవాబిచ్చాడు |
||||||
క్రీస్తు దావీదు కుమారుడా అని ప్రజల్ని అడిగాడు |
||||||
శాస్త్రులకు, పరిసయ్యులకు శ్రమలు |
||||||
విధవరాలి విరాళాన్ని గమనించాడు |
||||||
ఒలీవల కొండ |
భవిష్యత్తు ప్రత్యక్షత సూచన ఇచ్చాడు |
|||||
ఉదాహరణలు: పదిమంది కన్యలు, తలాంతులు, గొర్రెలు-మేకలు |
||||||
నీసాను 12 (ఏప్రిల్ 5-6, 2020) |
యెరూషలేము |
ఆయన్ని చంపడానికి యూదా అధికారుల కుట్ర |
||||
యేసును అప్పగించడానికి యూదా ఏర్పాట్లు |
||||||
నీసాను 13 (ఏప్రిల్ 6-7, 2020) |
యెరూషలేము దగ్గర్లో, యెరూషలేములో |
చివరి పస్కాకు సిద్ధపడడం |
||||
నీసాను 14 (ఏప్రిల్ 7-8, 2020) |
యెరూషలేము |
అపొస్తలులతో కలిసి పస్కా భోజనం చేశాడు |
||||
అపొస్తలుల పాదాలు కడిగాడు |
||||||
యేసు యూదాను ద్రోహి అని స్పష్టం చేసి, పంపించేశాడు |
||||||
ప్రభువు రాత్రి భోజనాన్ని నెలకొల్పాడు (1కొ 11:23-25) |
||||||
పేతురు తానెవరో తెలీదంటాడని, అపొస్తలులు చెదిరిపోతారని ప్రవచించాడు |
||||||
సహాయకుణ్ణి పంపిస్తానని వాగ్దానం చేశాడు; నిజమైన ద్రాక్షచెట్టు ఉదాహరణ; ప్రేమించాలని ఆజ్ఞాపించాడు; అపొస్తలులతో చివరి ప్రార్థన |
||||||
గెత్సేమనే |
తోటలో వేదన; యేసును అప్పగించడం, బంధించడం |
|||||
యెరూషలేము |
అన్న ప్రశ్నించాడు; కయప, మహాసభ విచారణ; పేతురు ఆయనెవరో తెలీదన్నాడు |
|||||
నమ్మకద్రోహి యూదా ఉరి వేసుకున్నాడు (అపొ 1:18, 19) |
||||||
ముందు పిలాతు దగ్గరికి, తర్వాత హేరోదు దగ్గరికి, తిరిగి పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు |
||||||
పిలాతు ఆయన్ని విడుదల చేయడానికి ప్రయత్నించాడు, కానీ యూదులు బరబ్బను అడిగారు; హింసాకొయ్య మీద మరణశిక్ష విధించారు |
||||||
(దాదాపు మధ్యాహ్నం 3:00 గంటలు) |
గొల్గొతా |
హింసాకొయ్య మీద చనిపోయాడు |
||||
యెరూషలేము |
మృతదేహాన్ని కొయ్య నుండి దించి సమాధిలో పెట్టారు |
|||||
నీసాను 15 (ఏప్రిల్ 8-9, 2020) |
యెరూషలేము |
యాజకులు, పరిసయ్యులు సమాధికి కాపలా పెట్టి, దానికి ముద్రవేశారు |
||||
నీసాను 16 (ఏప్రిల్ 9-10, 2020) |
యెరూషలేము, దాని పరిసర ప్రాంతం; ఎమ్మాయు |
యేసు పునరుత్థానం చేయబడ్డాడు; శిష్యులకు ఐదుసార్లు కనిపించాడు |
||||
నీసాను 16 తర్వాత |
యెరూషలేము; గలిలయ |
శిష్యులకు ఇంకొన్నిసార్లు కనిపించాడు (1కొ 15:5-7; అపొ 1:3-8); నిర్దేశాలిచ్చాడు; శిష్యుల్ని చేయమని ఆజ్ఞాపించాడు |