కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 3:19, 20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 19 అయితే శక్తివంతమైన* చెయ్యి బలవంతం చేస్తే తప్ప ఐగుప్తు రాజు మీకు అనుమతి ఇవ్వడని నాకు బాగా తెలుసు.+ 20 కాబట్టి నేను నా చెయ్యి చాపి, ఐగుప్తులో నేను చేయబోయే అసాధారణమైన పనులన్నిటితో ఆ దేశాన్ని కొట్టాల్సి ఉంటుంది. ఆ తర్వాత అతను మిమ్మల్ని పంపించేస్తాడు.+

  • నిర్గమకాండం 6:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 కాబట్టి యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “నేను ఫరోకు ఏం చేస్తానో ఇప్పుడు నువ్వు చూస్తావు.+ నా ప్రజల్ని పంపించేలా శక్తివంతమైన* చెయ్యి అతన్ని బలవంతం చేస్తుంది, వాళ్లను తన దేశంలో నుండి వెళ్లగొట్టేలా శక్తివంతమైన చెయ్యి అతన్ని బలవంతం చేస్తుంది.”+

  • నిర్గమకాండం 10:8-11
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 కాబట్టి మోషే, అహరోనుల్ని మళ్లీ ఫరో దగ్గరికి తీసుకొచ్చారు, అప్పుడు ఫరో వాళ్లతో ఇలా అన్నాడు: “వెళ్లి, మీ దేవుడైన యెహోవాను సేవించండి. అయితే ఎవరెవరు వెళ్తారో చెప్పండి.” 9 అప్పుడు మోషే ఇలా అన్నాడు: “మేము మా యౌవనుల్ని, వృద్ధుల్ని, మా కుమారుల్ని, కూతుళ్లను, మా గొర్రెల్ని, పశువుల్ని తీసుకొని వెళ్తాం.+ ఎందుకంటే మేము యెహోవాకు పండుగ ఆచరిస్తాం.”+ 10 అప్పుడు ఫరో వాళ్లతో ఇలా అన్నాడు: “నేను నిజంగా మిమ్మల్ని, మీ పిల్లల్ని పంపిస్తానని అనుకుంటున్నారా? అదే జరిగితే, యెహోవా నిజంగా మీకు తోడు ఉన్నట్టే!+ మీ మనసులో ఏదో దురుద్దేశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. 11 మీ అందర్నీ నేను పంపించను! యెహోవాను సేవించడానికి మీలోని పురుషులు మాత్రమే వెళ్లొచ్చు. మీరు అడిగింది కూడా అదే కదా.” దాంతో మోషే, అహరోనుల్ని ఫరో ముందు నుండి వెళ్లగొట్టేశారు.

  • కీర్తన 105:38
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 38 వాళ్లు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తు సంతోషించింది,

      ఎందుకంటే ఇశ్రాయేలీయులంటే* వాళ్లకు భయం పట్టుకుంది.+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి