కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 40:21
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 21 అతను ఆ మందసాన్ని గుడారం లోపలికి తీసుకొచ్చి, ఆ సాక్ష్యపు మందసం కనిపించకుండా ఉండేలా తెరను+ వేలాడదీశాడు.+ యెహోవా తనకు ఆజ్ఞాపించినట్టే మోషే చేశాడు.

  • లేవీయకాండం 16:2
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 యెహోవా మోషేకు ఇలా చెప్పాడు: “నీ సహోదరుడైన అహరోను చనిపోకుండా ఉండేలా,+ తెర+ లోపల ఉన్న పవిత్ర స్థలంలోకి+ అంటే మందసం* మూత ముందుకు ఎప్పుడుబడితే అప్పుడు రాకూడదని అతనికి చెప్పు. ఎందుకంటే నేను ఆ మందసం మూత మీద+ మేఘంలో+ కనిపిస్తాను.

  • 1 రాజులు 8:6
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 6 అప్పుడు యాజకులు యెహోవా ఒప్పంద మందసాన్ని దాని స్థానంలోకి,+ అంటే మందిరంలోని అత్యంత లోపలి గది అయిన అతి పవిత్ర స్థలంలోకి తీసుకొచ్చి, కెరూబుల రెక్కల కింద ఉంచారు.+

  • హెబ్రీయులు 9:2-4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 2 గుడారం రెండు గదులుగా నిర్మించబడింది. మొదటి గదిలో దీపస్తంభం,+ బల్ల, సముఖపు రొట్టెలు*+ ఉండేవి. ఆ గదికి “పవిత్ర స్థలం” అని పేరు.+ 3 అయితే, రెండో తెర*+ అవతల ఉన్న గదికి “అతి పవిత్ర స్థలం” అని పేరు.+ 4 అందులో బంగారు ధూపపాత్ర,+ అన్నివైపులా బంగారు రేకు తొడిగిన+ ఒప్పంద మందసం*+ ఉండేవి. ఈ ఒప్పంద మందసంలో మన్నా ఉన్న బంగారు పాత్ర,+ చిగురించిన అహరోను కర్ర,+ ఒప్పందపు రాతి పలకలు+ ఉండేవి.

  • హెబ్రీయులు 9:12
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 ఆయన మేకల రక్తంతోనో, కోడెదూడల రక్తంతోనో కాకుండా తన సొంత రక్తంతో అతి పవిత్ర స్థలంలో అడుగుపెట్టాడు.+ అలా ఆయన అన్నికాలాలకు సరిపోయేలా ఒక్కసారే అందులో అడుగుపెట్టి, మనకు శాశ్వతమైన విడుదలను* తీసుకొచ్చాడు.+

  • హెబ్రీయులు 9:24
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 24 ఎందుకంటే, చేతులతో చేయబడిన, అసలైనవాటికి ప్రతిబింబంగా ఉన్న+ అతి పవిత్ర స్థలంలో క్రీస్తు అడుగుపెట్టలేదు;+ కానీ ఇప్పుడు మన తరఫున దేవుని ముందు కనబడడానికి పరలోకంలోనే అడుగుపెట్టాడు.+

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి