22 “అయితే మీరంతా నా దగ్గరికి వచ్చి ఇలా అన్నారు: ‘మనకు ముందుగా కొంతమంది మనుషుల్ని పంపుదాం. వాళ్లు వెళ్లి ఆ దేశాన్ని పరిశీలించి, మనం ఏ దారిలో వెళ్లాలో, మనకు ఎలాంటి నగరాలు ఎదురౌతాయో చెప్తారు.’+ 23 ఆ సలహా నాకు నచ్చి, మీ మధ్య ఒక్కో గోత్రం నుండి ఒక్కో వ్యక్తి చొప్పున 12 మందిని ఎంచుకున్నాను.+