-
కీర్తన 78:43-51పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
43 ఐగుప్తులో ఆయన ఎలాంటి సూచనలు చూపించాడో,+
సోయను ప్రాంతంలో ఎలాంటి అద్భుతాలు చేశాడో,
44 వాళ్లు నైలు కాలువల నీళ్లను తాగలేకపోయేలా
వాటిని ఎలా రక్తంగా మార్చాడో+ వాళ్లు గుర్తుచేసుకోలేదు.
46 వాళ్ల పంటల్ని తిండిబోతు మిడతలకు,
వాళ్ల కష్టఫలాన్ని మిడతల దండుకు అప్పగించాడు.+
47 వడగండ్ల వానతో వాళ్ల ద్రాక్షతీగల్ని,
వడగండ్లతో వాళ్ల అత్తి చెట్లను నాశనం చేశాడు.+
49 మండుతున్న తన కోపాన్ని,
ఆగ్రహాన్ని, ఉగ్రతను, కష్టాల్ని,
విపత్తు తీసుకురావడానికి దేవదూతల సమూహాల్ని వాళ్ల మీదికి పంపుతూ వచ్చాడు.
50 ఆయన తన కోపానికి దారిని సిద్ధం చేశాడు.
మరణం నుండి వాళ్లను తప్పించలేదు;
వాళ్లను తెగులుకు అప్పగించాడు.
51 చివరిగా, ఆయన ఐగుప్తీయుల మొదటి సంతానమంతటినీ,
హాము డేరాల్లోని వాళ్ల తొలిచూలును చంపేశాడు.+
-