-
2 సమూయేలు 17:27-29పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
27 దావీదు మహనయీముకు రాగానే, అమ్మోనీయుల రబ్బా+ నగరం నుండి నాహాషు కుమారుడైన షోబీ, లోదెబారు నుండి అమ్మీయేలు కుమారుడైన మాకీరు,+ రోగెలీము నుండి గిలాదీయుడైన బర్జిల్లయి+ 28 పరుపులు, పాత్రలు, కుండలు, గోధుమలు, బార్లీ, పిండి, వేయించిన ధాన్యం, పెద్ద చిక్కుళ్లు, చిక్కుడు గింజలు, ఎండబెట్టిన ధాన్యం తీసుకొచ్చారు; 29 అలాగే తేనె, వెన్న, గొర్రెలు, జున్ను* తీసుకొచ్చారు. వాళ్లు, “ఎడారిలో ప్రజలు అలసిపోయుంటారు, వాళ్లు ఆకలితో, దాహంతో ఉంటారు”+ అని అనుకొని దావీదు కోసం, అతనితో ఉన్న మనుషుల కోసం అవన్నీ తీసుకొచ్చారు.+
-