8 మనుషులు, జంతువులు అందరూ గోనెపట్ట కట్టుకోవాలి; వాళ్లు దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకోవాలి. తమ చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి, హానికరమైన ప్రవర్తన మానేయాలి. 9 ఒకవేళ సత్యదేవుడు తాను చేయాలనుకుంటున్న దానిగురించి ఇంకోసారి ఆలోచించుకుని తన కోపాగ్నిని చల్లార్చుకుంటాడేమో, అప్పుడు మనం నాశనమవకుండా ఉంటాం.”