30 ఒమ్రీ కుమారుడైన అహాబు తనకు ముందున్న వాళ్లందరికన్నా యెహోవా దృష్టికి ఘోరంగా ప్రవర్తించాడు.+ 31 అతను నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపాల్ని+ చేయడం చాలదన్నట్టు, సీదోనీయుల+ రాజు ఎత్బయలు కూతురైన యెజెబెలును+ కూడా పెళ్లిచేసుకుని, బయలును సేవించడం,+ దానికి మొక్కడం మొదలుపెట్టాడు.