-
యెషయా 37:1-4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
37 హిజ్కియా రాజు ఆ మాటలు వినగానే తన బట్టలు చింపుకొని, గోనెపట్ట కట్టుకొని యెహోవా మందిరంలోకి వెళ్లాడు.+ 2 తర్వాత అతను రాజభవనం* మీద అధికారైన ఎల్యాకీమును, కార్యదర్శి షెబ్నాను, యాజకుల్లో పెద్దల్ని ఆమోజు కుమారుడైన యెషయా+ ప్రవక్త దగ్గరికి పంపించాడు. వాళ్లు గోనెపట్ట కట్టుకొని వెళ్లి, 3 అతనితో ఇలా అన్నారు: “హిజ్కియా ఇలా చెప్తున్నాడు, ‘ఈ రోజు శ్రమ, దూషణ,* అవమానం ఉన్న రోజు; ప్రసవించే సమయం వచ్చింది, కానీ కనడానికి శక్తి చాలట్లేదు.+ 4 నీ దేవుడైన యెహోవా బహుశా రబ్షాకే మాటల్ని విని, నీ దేవుడైన యెహోవా తాను విన్న మాటల్ని బట్టి అతన్ని శిక్షిస్తాడేమో. జీవంగల దేవుణ్ణి దూషించడానికి+ అతని ప్రభువైన అష్షూరు రాజే అతన్ని పంపించాడు. కాబట్టి బ్రతికున్న మిగతా ప్రజల+ కోసం ప్రార్థన చేయి.’ ”+
-