17 యెహోవా, నీ వల్ల మా పరిస్థితి
బిడ్డను కనబోతున్న గర్భిణీ స్త్రీ
పురిటినొప్పులు వచ్చినప్పుడు వేదనతో కేకలు వేసినట్టు ఉంది.
18 మేము గర్భం ధరించాం, పురిటినొప్పులు పడ్డాం,
కానీ గాలిని కన్నట్టే ఉంది.
మేము దేశానికి రక్షణ తీసుకురాలేదు,
దేశంలో నివసించడానికి ఎవరూ పుట్టలేదు.