15 స్వచ్ఛమైన బంగారంతో దాన్ని కొనలేం;
వెండిని తూచి ఇచ్చి దాన్ని పొందలేం.+
16 ఓఫీరు బంగారంతో+ గానీ,
అరుదైన సులిమాని రాళ్లతో గానీ, నీలం రాళ్లతో గానీ దాన్ని కొనలేం.
17 బంగారం, గాజు దానికి సాటిరావు;
మేలిమి బంగారు పాత్రను ఇచ్చి దాన్ని పొందలేం.+
18 పగడం, స్ఫటికం దాని దరిదాపుల్లోకి కూడా రావు,+
ముత్యాలతో నిండిన సంచి కన్నా తెలివి విలువైనది.