-
మార్కు 1:2-4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
2 యెషయా ప్రవక్త ఇలా రాశాడు: “(ఇదిగో! నా సందేశకుణ్ణి నీకు ముందుగా పంపిస్తున్నాను. అతను నీ కోసం మార్గం సిద్ధం చేస్తాడు.)+ 3 ‘యెహోవా* మార్గాన్ని సిద్ధం చేయండి! ఆయన దారుల్ని ఖాళీగా ఉంచండి’ అని ఎడారిలో* ఒక వ్యక్తి* అరుస్తున్నాడు.”+ 4 ప్రవక్త రాసినట్టే, బాప్తిస్మమిచ్చే యోహాను ఎడారిలో ఉంటూ, పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకోమని ప్రకటిస్తూ వచ్చాడు.+
-
-
లూకా 3:3-6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 కాబట్టి అతను యొర్దాను చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వెళ్లి, పాపక్షమాపణ కోసం పశ్చాత్తాపానికి గుర్తుగా బాప్తిస్మం తీసుకోమని ఆ ప్రాంతాలన్నిట్లో ప్రకటిస్తూ ఉన్నాడు.+ 4 ఎందుకంటే, యెషయా ప్రవక్త పుస్తకంలో ఇలా రాసి ఉంది: “ఎడారిలో ఒక వ్యక్తి* ఇలా అరుస్తున్నాడు: ‘యెహోవా* మార్గాన్ని సిద్ధం చేయండి! ఆయన దారుల్ని ఖాళీగా ఉంచండి.+ 5 ప్రతీ లోయను పూడ్చాలి; ప్రతీ పర్వతాన్ని, కొండను చదును చేయాలి. వంకరగా ఉన్న దారులు తిన్నగా అవ్వాలి, గరుకుగా ఉన్న దారులు నున్నగా అవ్వాలి. 6 మనుషులందరూ దేవుని రక్షణను* చూస్తారు.’ ”+
-