-
ద్వితీయోపదేశకాండం 12:29-31పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
29 “నువ్వు స్వాధీనం చేసుకోబోయే జనాల్ని నీ దేవుడైన యెహోవా సమూలంగా నాశనం చేశాక,+ నువ్వు వాళ్ల దేశంలో నివసిస్తున్నప్పుడు, 30 వాళ్లు నీ ముందు నుండి సమూలంగా నాశనం చేయబడిన తర్వాత నువ్వు ఉరిలో చిక్కుకోకుండా జాగ్రత్తపడు. ‘ఈ జనాలు తమ దేవుళ్లను ఎలా పూజించేవాళ్లో చెప్పండి, నేనూ అలాగే చేస్తాను’+ అంటూ నువ్వు వాళ్ల దేవుళ్ల గురించి అడగకూడదు. 31 నువ్వు నీ దేవుడైన యెహోవాను అలా ఆరాధించకూడదు. ఎందుకంటే వాళ్లు తమ దేవుళ్ల కోసం, యెహోవా ద్వేషించే ప్రతీ అసహ్యమైన పనిని చేస్తారు; ఆఖరికి తమ దేవుళ్లకు అర్పించడం కోసం తమ కుమారుల్ని, కూతుళ్లను అగ్నిలో వేసి కాల్చేస్తారు.+
-
-
యెహెజ్కేలు 20:31పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
31 మీ అసహ్యమైన విగ్రహాలన్నిటికీ బలులు అర్పిస్తూ, మీ పిల్లల్ని అగ్నిలో వేసి కాలుస్తూ,*+ మీరు ఈ రోజు వరకు మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకుంటున్నారా? ఇశ్రాయేలు ఇంటివాళ్లారా, మీరు ఇలా చేస్తున్నా, మీరు విచారణ చేసినప్పుడు నేను జవాబివ్వాలా?” ’+
“ ‘నా జీవం తోడు, నేను మీకు జవాబివ్వను’ అని సర్వోన్నత ప్రభువైన యెహోవా అంటున్నాడు.+
-