-
ఫిలిప్పీయులు 2:9-11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 ఈ కారణం వల్లే దేవుడు ఆయన్ని హెచ్చించి, అంతకుముందు కన్నా ఉన్నతమైన స్థానంలో పెట్టాడు,+ దయతో అన్నిటికన్నా శ్రేష్ఠమైన పేరును ఆయనకు ఇచ్చాడు.+ 10 పరలోకంలో, భూమ్మీద, భూమికింద ఉన్న ప్రతీ ఒక్కరు యేసు పేరున మోకరించాలని, 11 తండ్రైన దేవునికి మహిమ కలిగేలా ప్రతీ ఒక్కరు యేసుక్రీస్తే ప్రభువని బహిరంగంగా ఒప్పుకోవాలని+ దేవుడు అలా చేశాడు.
-