6ఇశ్రాయేలీయులు* ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన+ 480వ సంవత్సరంలో, అంటే సొలొమోను ఇశ్రాయేలు మీద రాజైన నాలుగో సంవత్సరం, జీవ్* నెలలో+ (అంటే రెండో నెలలో) అతను యెహోవా మందిరాన్ని* కట్టించడం మొదలుపెట్టాడు.+
12 పాత మందిరాన్ని చూసిన వృద్ధులు,+ అంటే చాలామంది యాజకులు, లేవీయులు, పూర్వీకుల కుటుంబాల పెద్దలు ఆ మందిర పునాది వేయబడుతుండడం చూసినప్పుడు పెద్దగా ఏడ్చారు; అదే సమయంలో చాలామంది ఇతరులు సంతోషంతో గట్టిగా కేకలు వేశారు.+