కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మార్కు 8:1-9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 ఆ రోజుల్లో, ఇంకొకసారి చాలామంది ప్రజలు యేసు దగ్గరికి వచ్చారు, వాళ్ల దగ్గర తినడానికి ఏమీ లేదు. కాబట్టి ఆయన శిష్యుల్ని పిలిచి ఇలా అన్నాడు: 2 “ఈ ప్రజల్ని చూస్తే నాకు జాలేస్తోంది.+ మూడు రోజులుగా వాళ్లు నాతోనే ఉన్నారు, తినడానికి వాళ్ల దగ్గర ఏమీ లేదు.+ 3 వాళ్లను ఇలాగే ఆకలితో ఇళ్లకు పంపించేస్తే దారిలోనే కళ్లు తిరిగి పడిపోతారు; కొందరైతే మరీ దూరం నుండి వచ్చారు.” 4 అయితే శిష్యులు, “ఈ మారుమూల ప్రాంతంలో ఇంతమంది ఆకలి తీర్చడానికి కావాల్సినంత ఆహారం ఎక్కడ దొరుకుతుంది?” అన్నారు. 5 అందుకు ఆయన, “మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి?” అని వాళ్లను అడిగాడు. వాళ్లు, “ఏడు రొట్టెలు” అని చెప్పారు.+ 6 అప్పుడు ఆయన ప్రజల్ని నేలమీద కూర్చోమని చెప్పాడు. తర్వాత ఆయన ఆ ఏడు రొట్టెల్ని తీసుకొని దేవునికి కృతజ్ఞతలు చెప్పి, వాటిని విరిచి ప్రజలకు పంచిపెట్టడానికి శిష్యులకు ఇవ్వడం మొదలుపెట్టాడు, వాళ్లు ప్రజలకు పంచిపెట్టారు.+ 7 వాళ్ల దగ్గర కొన్ని చిన్నచేపలు కూడా ఉన్నాయి, ఆయన వాటికోసం కూడా దేవునికి కృతజ్ఞతలు చెప్పి వాటిని ప్రజలకు పంచిపెట్టమని చెప్పాడు. 8 ప్రజలు తృప్తిగా తిన్నారు, మిగిలిన ముక్కల్ని శిష్యులు పోగుచేసినప్పుడు ఏడు పెద్ద గంపలు నిండాయి.+ 9 ఈసారి అక్కడ దాదాపు 4,000 మంది పురుషులు ఉన్నారు. తర్వాత యేసు వాళ్లను పంపించేశాడు.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి