-
మార్కు 12:18-23పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 ఆ తర్వాత, పునరుత్థానం లేదని చెప్పే* సద్దూకయ్యులు+ ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు:+ 19 “బోధకుడా, ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే, అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకుని అతని కోసం పిల్లల్ని కనాలని మోషే రాశాడు.+ 20 అయితే ఒక కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్లు. మొదటివాడు ఒకామెను పెళ్లి చేసుకున్నాడు, కానీ పిల్లలు లేకుండానే చనిపోయాడు. 21 రెండోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు, కానీ అతను కూడా పిల్లలు లేకుండానే చనిపోయాడు. మూడోవాడి విషయంలో కూడా అదే జరిగింది. 22 అలా ఆ ఏడుగురూ పిల్లలు లేకుండానే చనిపోయారు, చివరికి ఆమె కూడా చనిపోయింది. 23 ఆ ఏడుగురూ ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా, మరి చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికినప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?”
-
-
లూకా 20:27-33పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
27 అయితే పునరుత్థానం లేదని చెప్పే* సద్దూకయ్యుల్లో+ కొంతమంది ఆయన దగ్గరికి వచ్చి ఇలా అడిగారు:+ 28 “బోధకుడా, ‘ఒక వ్యక్తి పిల్లలు లేకుండా చనిపోతే, అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని అతని కోసం పిల్లల్ని కనాలి’ అని మోషే రాశాడు.+ 29 ఒక కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉండేవాళ్లు. మొదటివాడు ఒకామెను పెళ్లి చేసుకొని, పిల్లలు లేకుండానే చనిపోయాడు. 30 కాబట్టి రెండోవాడు, 31 ఆ తర్వాత మూడోవాడు ఆమెను పెళ్లి చేసుకున్నారు. అలా ఆ ఏడుగురూ ఆమెను పెళ్లి చేసుకున్నారు; కానీ పిల్లలు లేకుండానే చనిపోయారు. 32 చివరికి ఆమె కూడా చనిపోయింది. 33 ఆ ఏడుగురూ ఆమెను పెళ్లి చేసుకున్నారు కదా, మరి చనిపోయినవాళ్లు మళ్లీ బ్రతికినప్పుడు ఆమె ఎవరికి భార్యగా ఉంటుంది?”
-