35 తర్వాత యేసు అన్ని నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయన అలా వెళ్తూ వాళ్ల సమాజమందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేస్తూ ఉన్నాడు.+
19 కాబట్టి, మీరు వెళ్లి అన్నిదేశాల ప్రజల్ని శిష్యుల్ని చేయండి;+ తండ్రి పేరున, కుమారుడి పేరున, పవిత్రశక్తి పేరున వాళ్లకు బాప్తిస్మం ఇవ్వండి;+20 నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ పాటించడం వాళ్లకు నేర్పించండి.*+ ఇదిగో! ఈ వ్యవస్థ* ముగింపు+ వరకు నేను ఎప్పుడూ మీతో ఉంటాను.”
6 అప్పుడు ఆకాశం మధ్యలో* ఎగురుతున్న ఇంకో దేవదూతను నేను చూశాను. అతను భూమ్మీద నివసించేవాళ్లకు అంటే ప్రతీ దేశానికి, తెగకు, భాషకు, జాతికి చెందిన ప్రజలకు నిత్యసువార్త* ప్రకటిస్తున్నాడు.+