-
మార్కు 14:17-21పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
17 సాయంకాలమయ్యాక, ఆయన పన్నెండుమందితో కలిసి అక్కడికి వచ్చాడు.+ 18 వాళ్లు భోంచేస్తున్నప్పుడు యేసు, “నేను నిజంగా మీతో చెప్తున్నాను, నాతో కలిసి భోంచేస్తున్న మీలో ఒకరు నన్ను అప్పగిస్తారు” అని చెప్పాడు.+ 19 అప్పుడు వాళ్లు దుఃఖపడి ఒకరి తర్వాత ఒకరు, “నేను కాదు కదా?” అని ఆయన్ని అడిగారు. 20 అందుకు ఆయన వాళ్లతో ఇలా అన్నాడు: “మీ పన్నెండుమందిలో ఒకరు, అంటే నాతోపాటు గిన్నెలో చెయ్యి ముంచేవాడే నన్ను అప్పగిస్తాడు.+ 21 మానవ కుమారుడు తన గురించి లేఖనాల్లో రాసివున్నట్టుగానే వెళ్లిపోతున్నాడు. కానీ ఎవరు మానవ కుమారుణ్ణి అప్పగిస్తారో అతనికి శ్రమ! అంతకన్నా, అతను పుట్టకపోయుంటేనే అతని పరిస్థితి బావుండేది.”
-