2 ఆ తర్వాత నూను కుమారుడైన యెహోషువ రహస్యంగా ఇద్దరు మనుషుల్ని షిత్తీము+ నుండి గూఢచారులుగా పంపించాడు. అతను వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు వెళ్లి దేశాన్ని, ముఖ్యంగా యెరికోను పరిశీలించి రండి.” కాబట్టి వాళ్లు యెరికోకు వెళ్లారు. వాళ్లు అక్కడ రాహాబు+ అనే వేశ్య ఇంటికి వెళ్లి ఆమె ఇంట్లో బసచేశారు.