32 వాళ్లు వెళ్లిపోతున్నప్పుడు, ఇదిగో! చెడ్డదూత పట్టిన ఒక మూగవాణ్ణి ప్రజలు యేసు దగ్గరికి తీసుకొచ్చారు.+ 33 యేసు ఆ చెడ్డదూతను వెళ్లగొట్టిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడాడు. అప్పుడు ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయి, “మనం ఇశ్రాయేలులో ఇలాంటిది ఎప్పుడూ చూడలేదే” అని అనుకున్నారు.