కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 41:40-46
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 40 నిన్ను నా ఇంటిమీద అధికారిగా నియమిస్తున్నాను. నా ప్రజలంతా అన్ని విషయాల్లో నీకు లోబడతారు.+ కేవలం రాజుగా ఉండే* విషయంలో మాత్రమే నేను నీ పైస్థానంలో ఉంటాను.” 41 ఫరో యోసేపుతో ఇంకా ఇలా అన్నాడు: “చూడు, నిన్ను ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమిస్తున్నాను.”+ 42 ఆ తర్వాత ఫరో తన ముద్ర-ఉంగరాన్ని తన చేతి నుండి తీసి యోసేపు చేతికి పెట్టాడు, అతనికి సన్నని నారబట్టలు తొడిగించాడు, మెడకు బంగారు హారం వేశాడు. 43 అంతేకాదు, ఘనతకు సూచనగా ఉన్న తన రెండో రథం మీద అతన్ని ఊరేగించాడు. జనం అతని ముందు వెళ్తూ, “అవ్రెఖ్‌! అవ్రెఖ్‌!”* అని కేకలువేశారు. అలా ఫరో అతన్ని ఐగుప్తు దేశమంతటి మీద అధికారిగా నియమించాడు.

      44 ఫరో యోసేపుతో ఇంకా ఇలా అన్నాడు: “నేను ఫరోను, కానీ నీ ఆమోదం లేకుండా ఐగుప్తు దేశమంతటా ఎవ్వరూ ఏ పనీ చేయకూడదు.”*+ 45 తర్వాత ఫరో యోసేపుకు జఫెనత్‌-పనేహు అని పేరు పెట్టి, ఓను* పూజారైన పోతీఫెర కూతురు ఆసెనతును+ ఇచ్చి పెళ్లి చేశాడు. తర్వాత యోసేపు ఐగుప్తు దేశాన్ని పర్యవేక్షించడం* మొదలుపెట్టాడు.+ 46 ఐగుప్తు రాజైన ఫరో ముందు నిలబడినప్పుడు* యోసేపు వయసు 30 ఏళ్లు.+

      తర్వాత యోసేపు ఫరో ముందు నుండి వెళ్లిపోయి, ఐగుప్తు దేశమంతటా ప్రయాణించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2027)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి