46 వాళ్లతో ఇలా అన్నాడు: “లేఖనాలు ఇలా చెప్తున్నాయి: క్రీస్తు బాధలుపడి, మూడో రోజున మృతుల్లో నుండి మళ్లీ బ్రతుకుతాడు; 47 ప్రజలు పశ్చాత్తాపపడి పాపక్షమాపణ పొందాలనే సందేశం, యెరూషలేముతో మొదలుపెట్టి+ అన్ని దేశాలకు+ ఆయన పేరున ప్రకటించబడుతుంది.
31 తన కుడిపక్కన కూర్చునేలా దేవుడు ఆయన్ని హెచ్చించాడు.+ ఇశ్రాయేలీయులు పశ్చాత్తాపపడి, పాపక్షమాపణ పొందేలా+ దేవుడు ఆయన్ని ముఖ్య ప్రతినిధిగా,+ రక్షకునిగా+ నియమించాడు.