18 సున్నతి చేయించుకున్న వ్యక్తి దేవుని పిలుపు అందుకున్నాడా?+ అయితే అతను సున్నతిని పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. సున్నతి చేయించుకోని వ్యక్తి దేవుని పిలుపు అందుకున్నాడా? అయితే అతను సున్నతి చేయించుకోవాల్సిన అవసరం లేదు.+
8 దేవుడు అన్యజనుల్ని విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్పు తీరుస్తాడన్న సంగతిని లేఖనం ముందే గ్రహించి, అబ్రాహాముకు ముందుగానే ఈ మంచివార్తను ప్రకటించింది: “అన్నిదేశాల ప్రజలు నీ ద్వారా దీవించబడతారు.”+