11 అయితే మృతుల్లో నుండి యేసును బ్రతికించిన దేవుని+ పవిత్రశక్తి మీలో నివసిస్తుంటే, క్రీస్తుయేసును మృతుల్లో నుండి బ్రతికించిన దేవుడే మీలో నివసిస్తున్న తన పవిత్రశక్తి ద్వారా, నశించిపోయే మీ శరీరాల్ని బ్రతికిస్తాడు.+
19 అంతేకాదు, విశ్వాసులమైన మనమీద పనిచేసే ఆయన శక్తి ఎంత గొప్పదో+ కూడా మీరు తెలుసుకోగలుగుతారు. ఆ శక్తి ఎంత గొప్పదనే విషయం, 20 దేవుడు మృతుల్లో నుండి క్రీస్తును బ్రతికించి పరలోకంలో తన కుడిపక్కన+ కూర్చోబెట్టుకున్నప్పుడు రుజువైంది.