-
హెబ్రీయులు 5:12-14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 ఈపాటికి* మీరు బోధకులుగా ఉండాల్సినవాళ్లు. కానీ దేవుని సందేశాల గురించిన ప్రాథమిక బోధల్ని ఇంకొకరు మళ్లీ మొదటినుండి మీకు నేర్పించాల్సి వస్తోంది;+ మీరు మళ్లీ పాలు తాగే స్థితికి వచ్చారు, గట్టి ఆహారం తినే స్థితిలో లేరు. 13 ఎప్పటికీ పాలే తాగేవాళ్లకు నీతి వాక్యం తెలీదు, ఎందుకంటే వాళ్లు ఇంకా పసిపిల్లలే.+ 14 అయితే గట్టి ఆహారం పరిణతిగల వాళ్ల కోసం. అలాంటివాళ్లు తమ వివేచనా సామర్థ్యాల్ని ఉపయోగిస్తూ వాటికి శిక్షణ ఇచ్చుకున్నారు. దానివల్ల వాళ్లు తప్పొప్పులను గుర్తించగలుగుతారు.
-