19 ఎందుకంటే, అన్నిటినీ ఆయనలో సంపూర్ణం చేయడం+ దేవునికి నచ్చింది. 20 అంతేకాదు అన్నీ, అంటే ఇటు భూమ్మీద ఉన్నవి, అటు పరలోకంలో ఉన్నవి ఆ కుమారుని ద్వారా మళ్లీ తనతో శాంతియుత సంబంధం కలిగివుండేలా చేయడం+ దేవునికి నచ్చింది. ఆ కుమారుడు హింసాకొయ్య మీద చిందించిన రక్తం వల్లే అది సాధ్యమైంది.+