-
1 కొరింథీయులు 9:16, 17పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
16 నేను మంచివార్త ప్రకటిస్తున్నానంటే, అందులో గొప్పలు చెప్పుకోవాల్సిందేమీ లేదు, ఎందుకంటే ప్రకటించడం నా బాధ్యత. నేను మంచివార్త ప్రకటించకపోతే నిజంగా నాకు శ్రమ!+ 17 నేను ఆ పనిని ఇష్టంగా చేస్తే, నాకు ప్రతిఫలం దక్కుతుంది; ఒకవేళ నేను ఆ పనిని ఇష్టం లేకుండా చేసినా, దేవుడు అప్పగించిన బాధ్యత నా మీద అలాగే ఉంటుంది.+
-
-
కొలొస్సయులు 1:25, 26పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
25 దేవుడు నాకు అప్పగించిన బాధ్యత+ ప్రకారం ఆ సంఘానికే నేను పరిచారకుణ్ణి అయ్యాను. మీకు ప్రయోజనం కలిగేలా దేవుని వాక్యాన్ని పూర్తిగా ప్రకటించాలని, 26 అంటే ఎన్నో యుగాలుగా,* ఎన్నో తరాలుగా దాచబడిన+ పవిత్ర రహస్యాన్ని+ ప్రకటించాలని దేవుడు నాకు ఆ బాధ్యతను అప్పగించాడు. ఆ రహస్యం ఇప్పుడు దేవుని పవిత్రులకు బయల్పర్చబడింది;+
-