-
న్యాయాధిపతులు 14:5, 6పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
5 సమ్సోను తన తల్లిదండ్రులతో కలిసి తిమ్నాకు వెళ్లాడు. అతను తిమ్నా ద్రాక్షతోటల దగ్గరికి వచ్చేసరికి, ఇదిగో! ఒక కొదమ సింహం గర్జిస్తూ అతనికి ఎదురొచ్చింది. 6 అప్పుడు యెహోవా పవిత్రశక్తి అతన్ని శక్తిమంతుణ్ణి చేయడంతో+ ఒక వ్యక్తి వట్టిచేతులతో మేకపిల్లను రెండుగా చీల్చినట్టు సమ్సోను ఆ సింహాన్ని రెండుగా చీల్చేశాడు. అయితే తాను చేసినదాని గురించి అతను తన తండ్రికి గానీ తల్లికి గానీ చెప్పలేదు.
-
-
1 సమూయేలు 17:34-36పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
34 అప్పుడు దావీదు సౌలుతో ఇలా అన్నాడు: “నీ సేవకుడినైన నేను నా తండ్రి మందను కాస్తున్నప్పుడు ఒకసారి సింహం,+ ఇంకోసారి ఎలుగుబంటి వచ్చి మంద నుండి ఒక గొర్రెను ఎత్తుకెళ్లాయి. 35 నేను వాటి వెంటబడి, వాటిని కొట్టి, వాటి నోటి నుండి గొర్రెను రక్షించాను. అవి నా మీదికి లేచినప్పుడు, నేను వాటి దవడ పట్టుకొని వాటిని కొట్టి చంపాను. 36 నీ సేవకుడు సింహాన్ని, ఎలుగుబంటిని రెండిటినీ చంపాడు. సున్నతిలేని ఈ ఫిలిష్తీయుడు కూడా వాటిలాగే అవుతాడు. ఎందుకంటే అతను జీవంగల దేవుని సైన్యాల్ని సవాలు చేశాడు.”*+
-