4 ఎందుకంటే, కొందరు రహస్యంగా మీలో చొరబడ్డారు. వాళ్లకు ఎంతోకాలం క్రితమే లేఖనాలు ఈ తీర్పు విధించాయి; వాళ్లు భక్తిహీనులు, వాళ్లు దేవుని అపారదయను అలుసుగా తీసుకుని లెక్కలేనట్టు ప్రవర్తిస్తున్నారు;+ తమ ప్రవర్తనతో మన ఒకేఒక్క యజమానీ ప్రభువూ అయిన యేసుక్రీస్తును తిరస్కరిస్తున్నారు.+