2 అయితే, ఇశ్రాయేలు ప్రజల మధ్య అబద్ధ ప్రవక్తలు కూడా బయల్దేరారు. అలాగే మీ మధ్య కూడా అబద్ధ బోధకులు ఉంటారు.+ వీళ్లు రహస్యంగా విభజనలు సృష్టిస్తారు, అవి మీ విశ్వాసాన్ని పాడుచేస్తాయి. అంతేకాదు వాళ్లు తమను కొన్న యజమానిని+ కూడా వదిలేస్తారు. అలా తమ మీదికి తాము వేగంగా నాశనాన్ని కొనితెచ్చుకుంటారు.