8 నువ్వు చూసిన ఆ క్రూరమృగం అంతకుముందు ఉంది, ఇప్పుడు లేదు, కానీ త్వరలో అది అగాధం+ నుండి పైకి వచ్చి, నాశనం చేయబడుతుంది. భూమ్మీది ప్రజలు, అంటే ప్రపంచం పుట్టిన దగ్గర నుండి ఎవరి పేర్లయితే జీవగ్రంథంలో రాయబడలేదో+ వాళ్లు ఆ క్రూరమృగం అంతకుముందు ఉండడం, ఆ తర్వాత లేకపోవడం, అది మళ్లీ రావడం చూసి ఆశ్చర్యపోతారు.