10 అతను పవిత్రశక్తి ద్వారా నన్ను ఒక ఎత్తైన గొప్ప పర్వతానికి తీసుకెళ్లాడు. అతను, పవిత్ర నగరమైన యెరూషలేము పరలోకంలోని దేవుని దగ్గర నుండి దిగిరావడం+ నాకు చూపించాడు. 11 దానికి దేవుని మహిమ ఉంది.+ అది ఎంతో అమూల్యమైన రాయిలా, స్ఫటికమంత స్పష్టంగా మెరిసే సూర్యకాంతపు రాయిలా ప్రకాశిస్తోంది.+