కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 11
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

లేవీయకాండం విషయసూచిక

      • పవిత్రమైన, అపవిత్రమైన జంతువులు (1-47)

లేవీయకాండం 11:2

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 14:4-6; యెహె 4:14

లేవీయకాండం 11:3

అధస్సూచీలు

  • *

    లేదా “గిట్ట.”

లేవీయకాండం 11:4

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 14:7, 8

లేవీయకాండం 11:5

అధస్సూచీలు

  • *

    అంటే, రాక్‌ బ్యాడ్జర్‌.

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +సామె 30:26

లేవీయకాండం 11:7

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 65:4; 66:3, 17

లేవీయకాండం 11:8

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +అపొ 10:14

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 12/2020, పేజీ 2

లేవీయకాండం 11:9

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 14:9, 10

లేవీయకాండం 11:11

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 14:3

లేవీయకాండం 11:13

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యోబు 39:27, 30
  • +ద్వితీ 14:12-19

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2021, పేజీ 2

లేవీయకాండం 11:16

అధస్సూచీలు

  • *

    అంటే, సీ-గల్‌.

లేవీయకాండం 11:18

అధస్సూచీలు

  • *

    అంటే, పెలికన్‌.

లేవీయకాండం 11:20

అధస్సూచీలు

  • *

    లేదా “పురుగు.”

లేవీయకాండం 11:22

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +మత్త 3:4; మార్కు 1:6

లేవీయకాండం 11:24

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 14:46, 47; 15:8; 17:15; 22:4-6

లేవీయకాండం 11:25

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 14:2, 8; 15:2, 5; సం 19:10

లేవీయకాండం 11:26

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 14:7, 8

లేవీయకాండం 11:28

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 17:15, 16
  • +లేవీ 5:2

లేవీయకాండం 11:29

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +యెష 66:17

లేవీయకాండం 11:30

అధస్సూచీలు

  • *

    లేదా “నలికండ్లపాము లాంటిది.”

లేవీయకాండం 11:31

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 14:19
  • +లేవీ 11:24; 22:4, 5

లేవీయకాండం 11:33

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 15:12

లేవీయకాండం 11:36

అధస్సూచీలు

  • *

    లేదా “బావులు.”

లేవీయకాండం 11:39

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:23, 24; సం 19:11, 16

లేవీయకాండం 11:40

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 17:15; 22:3, 8; ద్వితీ 14:21; యెహె 4:14; 44:31

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    7/1/2005, పేజీ 27

లేవీయకాండం 11:41

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 11:21

లేవీయకాండం 11:42

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +ద్వితీ 14:3

లేవీయకాండం 11:43

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:25

లేవీయకాండం 11:44

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 20:2
  • +నిర్గ 19:6; లేవీ 19:2; ద్వితీ 14:2; 1థె 4:7
  • +1పే 1:15, 16; ప్రక 4:8

లేవీయకాండం 11:45

అధస్సూచీలు

  • *

    లేదా “ఈజిప్టు.”

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +నిర్గ 6:7; 29:46; హోషే 11:1
  • +నిర్గ 22:31; సం 15:40; ద్వితీ 7:6
  • +లేవీ 20:7, 26; యెహో 24:19; 1స 2:2

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    కావలికోట,

    5/15/2004, పేజీ 23

లేవీయకాండం 11:46

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2021, పేజీ 2

లేవీయకాండం 11:47

మార్జినల్‌ రెఫరెన్సులు

  • +లేవీ 20:25; యెహె 44:23

ఇండెక్సులు

  • పరిశోధనా పుస్తకం

    మీటింగ్‌ వర్క్‌బుక్‌ రెఫరెన్సులు, 1/2021, పేజీ 2

ఇతర అనువాదాలు

ఏదైనా వచనం ఎంచుకుని వేర్వేరు అనువాదాల్లో చూడండి.

మామూలు రెఫరెన్సులు

లేవీ. 11:2ద్వితీ 14:4-6; యెహె 4:14
లేవీ. 11:4ద్వితీ 14:7, 8
లేవీ. 11:5సామె 30:26
లేవీ. 11:7యెష 65:4; 66:3, 17
లేవీ. 11:8అపొ 10:14
లేవీ. 11:9ద్వితీ 14:9, 10
లేవీ. 11:11ద్వితీ 14:3
లేవీ. 11:13యోబు 39:27, 30
లేవీ. 11:13ద్వితీ 14:12-19
లేవీ. 11:22మత్త 3:4; మార్కు 1:6
లేవీ. 11:24లేవీ 14:46, 47; 15:8; 17:15; 22:4-6
లేవీ. 11:25లేవీ 14:2, 8; 15:2, 5; సం 19:10
లేవీ. 11:26ద్వితీ 14:7, 8
లేవీ. 11:28లేవీ 17:15, 16
లేవీ. 11:28లేవీ 5:2
లేవీ. 11:29యెష 66:17
లేవీ. 11:31ద్వితీ 14:19
లేవీ. 11:31లేవీ 11:24; 22:4, 5
లేవీ. 11:33లేవీ 15:12
లేవీ. 11:39లేవీ 11:23, 24; సం 19:11, 16
లేవీ. 11:40లేవీ 17:15; 22:3, 8; ద్వితీ 14:21; యెహె 4:14; 44:31
లేవీ. 11:41లేవీ 11:21
లేవీ. 11:42ద్వితీ 14:3
లేవీ. 11:43లేవీ 20:25
లేవీ. 11:44నిర్గ 20:2
లేవీ. 11:44నిర్గ 19:6; లేవీ 19:2; ద్వితీ 14:2; 1థె 4:7
లేవీ. 11:441పే 1:15, 16; ప్రక 4:8
లేవీ. 11:45నిర్గ 6:7; 29:46; హోషే 11:1
లేవీ. 11:45నిర్గ 22:31; సం 15:40; ద్వితీ 7:6
లేవీ. 11:45లేవీ 20:7, 26; యెహో 24:19; 1స 2:2
లేవీ. 11:47లేవీ 20:25; యెహె 44:23
  • పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
  • 6
  • 7
  • 8
  • 9
  • 10
  • 11
  • 12
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • 18
  • 19
  • 20
  • 21
  • 22
  • 23
  • 24
  • 25
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • 31
  • 32
  • 33
  • 34
  • 35
  • 36
  • 37
  • 38
  • 39
  • 40
  • 41
  • 42
  • 43
  • 44
  • 45
  • 46
  • 47
పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
లేవీయకాండం 11:1-47

లేవీయకాండం

11 తర్వాత యెహోవా మోషే, అహరోనులతో ఇలా అన్నాడు: 2 “ఇశ్రాయేలీయులకు ఇలా చెప్పండి: ‘నేల మీద తిరిగే ప్రాణుల్లో వీటిని మీరు తినొచ్చు:+ 3 పూర్తిగా చీలిన డెక్క* ఉండి, నెమరు వేసే ప్రతీ జంతువును మీరు తినొచ్చు.

4 “ ‘పూర్తిగా చీలిన డెక్క ఉన్న జంతువుల్లో లేదా నెమరు వేసే జంతువుల్లో వీటిని మీరు తినకూడదు: ఒంటె నెమరు వేస్తుంది కానీ దానికి చీలిన డెక్క ఉండదు. అది మీకు అపవిత్రమైనది.+ 5 పొట్టి కుందేలు*+ నెమరు వేస్తుంది కానీ దానికి చీలిన డెక్క ఉండదు. అది మీకు అపవిత్రమైనది. 6 చెవుల పిల్లి నెమరు వేస్తుంది కానీ దానికి చీలిన డెక్క ఉండదు. అది మీకు అపవిత్రమైనది. 7 పందిని+ కూడా మీరు తినకూడదు. దానికి చీలిన డెక్క ఉంటుంది కానీ అది నెమరు వేయదు. అది మీకు అపవిత్రమైనది. 8 వాటిలో దేని మాంసాన్నీ మీరు తినకూడదు, వాటి కళేబరాల్ని ముట్టకూడదు. అవి మీకు అపవిత్రమైనవి.+

9 “ ‘నీళ్లలో ఉండే వాటన్నిట్లో వీటిని మీరు తినొచ్చు: సముద్రంలో గానీ నదుల్లో గానీ రెక్కలు-పొలుసులు ఉన్న దేన్నైనా మీరు తినొచ్చు.+ 10 అయితే సముద్రంలో, నదుల్లో గుంపులుగుంపులుగా తిరిగే వాటిలో, అలాగే నీళ్లలో తిరిగే ఇతర ప్రాణులన్నిట్లో రెక్కలు-పొలుసులు లేనివి మీకు అసహ్యకరమైనవి. 11 అవును వాటిని మీరు అసహ్యించుకోవాలి, వాటిలో దేని మాంసాన్నీ మీరు తినకూడదు,+ వాటి కళేబరాల్ని మీరు అసహ్యించుకోవాలి. 12 నీళ్లలో తిరిగే వాటిలో రెక్కలు-పొలుసులు లేని ప్రతీది మీకు అసహ్యకరమైనది.

13 “ ‘ఎగిరే ప్రాణుల్లో వీటిని మీరు అసహ్యించుకోవాలి, వీటిని మీరు తినకూడదు, ఎందుకంటే ఇవి అసహ్యకరమైనవి: గద్ద,+ బోరువ, నల్ల రాబందు,+ 14 ఎర్ర గద్ద, ప్రతీ రకమైన నల్ల గద్ద, 15 ప్రతీ రకమైన కాకి, 16 నిప్పుకోడి, గుడ్లగూబ, సముద్రపక్షి,* ప్రతీ రకమైన డేగ, 17 చిన్న గుడ్లగూబ, చెరువుకాకి, పొడుగు చెవుల గుడ్లగూబ, 18 హంస, గూడబాతు,* రాబందు, 19 సంకుబుడి కొంగ, ప్రతీ రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలం. 20 రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో గుంపులుగుంపులుగా తిరిగే ప్రతీ ప్రాణి* మీకు అసహ్యకరమైనది.

21 “ ‘రెక్కలు ఉండి నాలుగు కాళ్లతో గుంపులుగుంపులుగా తిరిగే ప్రాణుల్లో, గెంతడం కోసం పాదాలకు పైన కీళ్లున్న వాటిని మాత్రం మీరు తినొచ్చు. 22 వాటిలో ఇవి మీరు తినొచ్చు: వలస వెళ్లే రకరకాల మిడతలు, మామూలు మిడతలు,+ కీచురాళ్లు, గొల్లభామలు. 23 అయితే రెక్కలూ, నాలుగు కాళ్లూ ఉండి గుంపులుగుంపులుగా తిరిగే మిగతా ప్రాణులన్నీ మీకు అసహ్యకరమైనవి. 24 వీటివల్ల మీరు అపవిత్రులౌతారు. వాటి కళేబరాల్ని ముట్టుకునే ప్రతీ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ 25 వాటిలో దేని కళేబరాలనైనా మోసుకెళ్లే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కోవాలి;+ అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.

26 “ ‘పూర్తిగా చీలిన డెక్క లేని, నెమరు వేయని ప్రతీ జంతువు మీకు అపవిత్రమైనదే. వాటిని ముట్టుకునే ప్రతీ వ్యక్తి అపవిత్రుడౌతాడు.+ 27 నాలుగు కాళ్లతో నడిచే ప్రాణుల్లో ఏవైతే పంజాలతో నడుస్తాయో అవన్నీ మీకు అపవిత్రమైనవి. వాటి కళేబరాల్ని ముట్టుకునే ప్రతీ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 28 వాటి కళేబరాల్ని మోసుకెళ్లే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కోవాలి.+ అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ అవి మీకు అపవిత్రమైనవి.

29 “ ‘నేలమీద పాకే ప్రాణుల్లో ఇవి మీకు అపవిత్రమైనవి: చిన్న పందికొక్కు, గెంతే ఎలుక,+ ప్రతీ రకమైన బల్లి, 30 గెకో బల్లి, ఉడుము, నీటి ఉడుము,* సరటము, ఊసరవెల్లి. 31 ఇవి మీకు అపవిత్రమైనవి.+ వాటి కళేబరాల్ని ముట్టుకునే ప్రతీ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+

32 “ ‘అవి చచ్చి ఏ వస్తువు మీదైనా పడితే, అది చెక్కపాత్ర గానీ, వస్త్రం గానీ, తోలు గానీ, గోనెపట్ట గానీ అది అపవిత్రమౌతుంది. రోజూ వాడుకునే వస్తువుల్లో దేనిమీదైనా అవి పడితే ఆ వస్తువును నీళ్లలో ముంచాలి. అది సాయంత్రం వరకు అపవిత్రంగా ఉంటుంది, తర్వాత పవిత్రమౌతుంది. 33 అవి మట్టిపాత్రలో పడితే, ఆ పాత్రను పగలగొట్టాలి, దానిలో ఉన్నదేదైనా అపవిత్రమౌతుంది.+ 34 అలాంటి పాత్రలోని నీళ్లు ఏదైనా ఆహారం మీద పడితే ఆ ఆహారం అపవిత్రమౌతుంది, అలాంటి పాత్రలో ఉన్న పానీయం ఏదైనా అది అపవిత్రమైనదే. 35 వాటి కళేబరాలు దేనిమీద పడినా అది అపవిత్రమౌతుంది. అది పొయ్యి అయినా, కుంపటి అయినా దాన్ని ముక్కలుముక్కలుగా పగలగొట్టాలి. అవి అపవిత్రమైనవి, అవి మీకు అపవిత్రమైనవిగానే ఉంటాయి. 36 ఊటలు,* నీళ్లు నిల్వ చేసే గుంటలు మాత్రం అవి పడినా పవిత్రంగానే ఉంటాయి. అయితే ఆ కళేబరాల్ని ముట్టుకునే వ్యక్తి అపవిత్రుడౌతాడు. 37 ఒకవేళ నాటాల్సిన విత్తనాల మీద వాటి కళేబరాలు పడితే, ఆ విత్తనాలు అపవిత్రం అవ్వవు. 38 కానీ నానబెట్టిన విత్తనాల మీద వాటి కళేబరంలో కొంచెం పడినా, అవి అపవిత్రమౌతాయి.

39 “ ‘తినదగిన జంతువు ఏదైనా చనిపోతే, దాని కళేబరాన్ని ముట్టుకునే ప్రతీ వ్యక్తి సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ 40 దాని కళేబరంలో కొంచెమైనా తినే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కోవాలి, అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు.+ దాని కళేబరాన్ని మోసుకెళ్లే వ్యక్తి తన వస్త్రాల్ని ఉతుక్కోవాలి, అతను సాయంత్రం వరకు అపవిత్రుడిగా ఉంటాడు. 41 నేలమీద పాకే ప్రతీ ప్రాణి మీకు అసహ్యకరమైనది.+ దాన్ని మీరు తినకూడదు. 42 పొట్టతో పాకే ఏ ప్రాణినీ, నాలుగు కాళ్లతో కదిలే ఏ ప్రాణినీ, చాలా కాళ్లతో నేలమీద తిరిగే ఏ ప్రాణినీ మీరు తినకూడదు. ఎందుకంటే అవి అసహ్యకరమైనవి.+ 43 పాకే ఏ ప్రాణి వల్లా మీరు అసహ్యకరంగా తయారవ్వకండి, మిమ్మల్ని మీరు మలినపర్చుకోకండి, అపవిత్రులు కాకండి.+ 44 ఎందుకంటే నేను మీ దేవుడైన యెహోవాను,+ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకొని పవిత్రులు అవ్వండి,+ ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.+ నేల మీద పాకే ఏ ప్రాణి వల్లా మిమ్మల్ని మీరు అపవిత్రపర్చుకోకండి. 45 ఎందుకంటే మీకు దేవునిగా ఉండడానికి ఐగుప్తు* దేశం నుండి మిమ్మల్ని బయటికి నడిపిస్తున్న యెహోవాను నేనే.+ మీరు పవిత్రులుగా ఉండాలి,+ ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.+

46 “ ‘జంతువుల గురించిన, ఎగిరే ప్రాణుల గురించిన, నీళ్లలో తిరిగే ప్రతీ ప్రాణి గురించిన, నేలమీద పాకే ప్రతీ ప్రాణి గురించిన నియమం ఇదే. 47 ఈ నియమం పవిత్రమైన దాన్ని, అపవిత్రమైన దాన్ని; తినదగిన ప్రాణుల్ని, తినకూడని ప్రాణుల్ని వేరుచేయడానికి ఉపయోగపడుతుంది.’ ”+

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి