కీర్తనలు
సంగీత నిర్దేశకునికి సూచన; గిత్తీత్* అనే రాగంలో పాడాలి. ఆసాపు+ కీర్తన.
81 దేవుడే మన బలం,+ సంతోషంతో ఆయన ముందు కేకలు వేయండి.
ఆనందంతో కేకలు వేస్తూ యాకోబు దేవుణ్ణి స్తుతించండి.
4 ఎందుకంటే, అది ఇశ్రాయేలుకు ఇచ్చిన ఆజ్ఞ,
యాకోబు దేవుని శాసనం.+
నేను గుర్తుపట్టని ఒక స్వరం* ఇలా చెప్పడం విన్నాను:
6 “నేను అతని భుజం మీదున్న బరువును దించేశాను;+
అతని చేతులు గంపను ఎత్తాల్సిన అవసరం లేదు.
7 కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు నాకు మొరపెట్టావు, నేను నిన్ను కాపాడాను;+
మెరీబా* నీళ్ల దగ్గర నిన్ను పరీక్షించాను.+ (సెలా)
8 నా ప్రజలారా వినండి, నేను మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను.
ఇశ్రాయేలూ, నువ్వు నా మాట వింటే ఎంత బావుంటుంది.+
9 అప్పుడు నీ మధ్య ఏ అన్య దేవుడూ ఉండడు,
వేరే దేశాల దేవునికి నువ్వు వంగి నమస్కారం చేయవు.+
10 ఐగుప్తు దేశం నుండి నిన్ను బయటికి తీసుకొచ్చిన
నీ దేవుడైన యెహోవాను నేనే.+
నీ నోటిని పెద్దగా తెరువు, నేను దాన్ని నింపుతాను.+
11 కానీ నా ప్రజలు నా మాట వినలేదు;
ఇశ్రాయేలు నాకు లోబడడానికి ఇష్టపడలేదు.+
12 కాబట్టి నేను వాళ్లను తమ మొండి హృదయాల ప్రకారం నడుచుకోనిచ్చాను;
14 అప్పుడు నేను వాళ్ల శత్రువుల్ని త్వరగా అణచివేస్తాను;
వాళ్ల విరోధుల్ని ఓడిస్తాను.+
15 యెహోవాను ద్వేషించేవాళ్లు వణుకుతూ ఆయన దగ్గరికి వస్తారు,
వాళ్లు ఎప్పటికీ శిక్ష అనుభవిస్తూ ఉంటారు.