యెషయా
57 నీతిమంతుడు నశించిపోయాడు,
కానీ ఎవరూ దాని గురించి ఆలోచించట్లేదు.
విశ్వసనీయులు తీసుకుపోబడుతున్నారు,*+
అయితే విపత్తు కారణంగా*
నీతిమంతుడు తీసుకుపోబడుతున్నాడని ఎవ్వరూ గ్రహించట్లేదు.
2 అతను నెమ్మది పొందుతాడు.
నిజాయితీగా నడుచుకునే వాళ్లందరూ తమ పరుపుల మీద* విశ్రాంతి తీసుకుంటారు.
4 మీరు ఎవర్ని గేలి చేస్తున్నారు?
ఎవర్ని వెక్కిరించడానికి మీ నోళ్లు పెద్దగా తెరుస్తున్నారు?
మీరు పాపులకు, అబద్ధాలాడే వాళ్లకు
పుట్టిన పిల్లలు+ కాదా?
5 మహా వృక్షాల మధ్య,
పచ్చగా ఉండే ప్రతీ చెట్టు కింద+ కామంతో రగిలిపోతున్నది+ మీరు కాదా?
లోయల్లో,* బండల సందుల కింద
పిల్లల్ని వధించేది మీరు+ కాదా?
6 నీ భాగం లోయల్లోని* నున్నని రాళ్లతో పాటు ఉంది.+
అవును, అవే నీకు వంతు.
చివరికి వాటికి కూడా నువ్వు పానీయార్పణలు, కానుకలు అర్పిస్తావు.+
వీటిని బట్టి నేను సంతృప్తి చెందాలా?*
7 ఎత్తైన, ఉన్నతమైన పర్వతం మీద నువ్వు పరుపు వేసుకున్నావు,+
బలులు అర్పించడానికి అక్కడికి ఎక్కివెళ్లావు.+
8 తలుపు వెనక, గుమ్మం వెనక నీ జ్ఞాపకార్థ చిహ్నాన్ని నిలబెట్టావు.
నన్ను విడిచివెళ్లి నీ బట్టలు విప్పేశావు;
పైకి ఎక్కి నీ పరుపును వెడల్పు చేసుకున్నావు.
వాళ్లతో ఒక ఒప్పందం చేసుకున్నావు.
నీ ప్రతినిధుల్ని దూరంగా పంపి,
సమాధిలోకి* దిగిపోయావు.
10 అనేక ప్రయాణాలు చేస్తూ చాలా కష్టపడ్డావు,
కానీ ‘దీనివల్ల ఉపయోగం లేదు!’ అని నువ్వు అనుకోలేదు.
నువ్వు మళ్లీ కొత్త బలం పొందావు.
అందుకే నువ్వు పట్టువిడవట్లేదు.*
11 నువ్వు ఎవరికి భయపడి, ఎవరికి బెదిరిపోయి
అబద్ధాలాడడం మొదలుపెట్టావు?+
నువ్వు నన్ను గుర్తుపెట్టుకోలేదు.+
దేని గురించీ ఆలోచించలేదు.+
నేను మౌనంగా ఉండి ఊరుకున్నాను.*+
అందుకే నువ్వు నాకు ఏమాత్రం భయపడలేదు.
అవన్నీ గాలికి కొట్టుకుపోతాయి,
ఉఫ్ అని ఊదితే ఎగిరిపోతాయి;
అయితే నన్ను ఆశ్రయంగా చేసుకున్నవాళ్లు దేశాన్ని స్వాస్థ్యంగా పొందుతారు,
నా పవిత్ర పర్వతాన్ని స్వాధీనం చేసుకుంటారు.+
14 అప్పుడు ఇలా అంటారు: ‘ఎత్తు చేయండి, దారిని ఎత్తు చేయండి! మార్గాన్ని సిద్ధం చేయండి!+
నా ప్రజల దారిలో ఉన్న అడ్డంకులన్నీ తీసేయండి.’ ”
15 ఎందుకంటే మహా ఘనుడు, ఉన్నతుడు,
నిరంతరం జీవిస్తూ ఉండే* దేవుడు,+ పవిత్రమైన పేరు ఉన్న దేవుడు+ ఇలా అంటున్నాడు:
“నేను ఎత్తైన, పవిత్ర స్థలంలో నివసిస్తాను,+
అయితే నలిగిపోయిన వాళ్లతో, దీనమనస్సు గలవాళ్లతో కూడా నివసిస్తూ
దీనుల ప్రాణాలు తెప్పరిల్లేలా చేస్తాను,
నలిగిపోయిన వాళ్ల హృదయాలకు నూతనోత్తేజాన్ని ఇస్తాను.+
16 నేను నిరంతరం వాళ్లను వ్యతిరేకిస్తూ ఉండను,
లేదా ఎల్లకాలం వాళ్లమీద కోపం ఉంచుకోను;+
ఎందుకంటే నావల్ల మనిషి జీవశక్తి* క్షీణిస్తుంది,+
నేను సృష్టించిన శ్వాసించే ప్రాణులు బలహీనమౌతాయి.
17 అతను అక్రమ లాభం కోసం పరుగులు తీస్తూ పాపం చేయడం+ చూసి నాకు చాలా కోపమొచ్చింది,
అందుకే నేనతన్ని కొట్టాను, నా ముఖం దాచుకున్నాను, నాకు చాలా కోపమొచ్చింది.
అయినాసరే అతను తన హృదయం నడిపించిన దారిలోనే నడుస్తూ భ్రష్టుడిలా ప్రవర్తిస్తూ వచ్చాడు.+
19 “నేనే పెదాల మీద స్తుతించే మాటలు పెడుతున్నాను.
దూరంగా ఉన్నవాళ్లకు, దగ్గరగా ఉన్నవాళ్లకు ఎప్పుడూ శాంతిని దయచేస్తాను,+
నేనే అతన్ని బాగుచేస్తాను” అని యెహోవా అంటున్నాడు.
20 “అయితే దుష్టులు, అల్లకల్లోలంగా ఉండి నిమ్మళించని సముద్రంలా ఉంటారు,
దానిలోని నీళ్లు నాచును, బురదను పైకి ఎగదోస్తూ ఉంటాయి.