పాట 100
ఆతిథ్యం ఇవ్వండి
1. అతిథిప్రియుడు యెహోవా ఎంతో
పెద్దమనసుతో ఇస్తున్నాడెంతో
వర్షాన్ని, సూర్యుణ్ణి
ఇస్తూ అందరిలో
నింపుతున్నాడెంతో సంతోషం.
దీనులకు సాయం చేస్తుంటే మనం
యెహోవా తండ్రికి పిల్లలమౌతాం
మంచిమనసుతో
చూపిస్తే దయను
ఆశీర్వదిస్తాడు దేవుడు.
2. సహాయం చేస్తుంటే ఇతరులకు
అవసరములో ఉన్నవాళ్లకు
ఆతిథ్య స్ఫూర్తితో
చేయందిస్తే మనం
జరగవచ్చు ఎంతో మేలు.
ఆనాటి లూదియ అనే స్త్రీలాగే
ఆహ్వానిస్తాం మనం ఇతరులను
మన తండ్రిలాగే
చూపిస్తే కరుణ
మరువడెప్పుడూ ఆయన.
(అపొ. 16:14, 15; రోమా. 12:13; 1 తిమో. 3:2; హెబ్రీ. 13:2; 1 పేతు. 4:9 కూడా చూడండి.)