6 అక్కడున్నవాళ్లలో సగం మంది సద్దూకయ్యులు, సగం మంది పరిసయ్యులు అని తెలిసి పౌలు మహాసభలో బిగ్గరగా ఇలా అన్నాడు: “సహోదరులారా, నేనొక పరిసయ్యుణ్ణి.+ పరిసయ్యుల కుటుంబంలో పుట్టాను. నేను చనిపోయినవాళ్లు తిరిగి బ్రతుకుతారనే బోధను నమ్ముతాను, అందుకే ఇప్పుడు నాకు తీర్పు జరుగుతోంది.”