కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • వివాహబంధాలను ఎలా పటిష్ఠపరచుకోవాలి
    కావలికోట—1993 | ఆగస్టు 15
    • అయినప్పటికిని, విశ్వాసఘాతుకంగా ప్రవర్తించిన జతనుండి విడాకులు తీసుకోవడాన్ని యేసు సిఫారసు చేయడం లేదు. కలుగు పర్యవసానాల్ని బాగా ఆలోచించిన తరువాత తాను విడాకులివ్వాలా వద్దా అనేది తప్పుచేయని వ్యక్తి నిర్ణయంపై ఆధారపడివుంటుంది. ఈ లేఖన ఆధారాన్నిబట్టి విడాకులివ్వాలని తలంచే భార్యలు మొదటి స్త్రీ పాపం చేసినప్పుడు ఆమెపై తీర్పు ప్రకటిస్తూ దేవుడు చెప్పిన విషయాన్ని కూడ ఆలోచించవచ్చును. మరణశిక్షతో పాటు దేవుడు హవ్వకు ప్రత్యేకంగా యిలా చెప్పాడు: “నీ భర్తయెడల నీకు వాంఛ కలుగును; అతడు నిన్ను ఏలును.” (ఆదికాండము 3:16) సి. ఎఫ్‌. కీల్‌ మరియు ఎఫ్‌. డెలిటిష్‌ వ్రాసిన కామెంట్రి ఆన్‌ ది ఓల్డ్‌ టెస్ట్‌మెంట్‌ ఈ “వాంఛ” “దాదాపు ఒక తెగులువంటి కోరిక” అని వర్ణించింది. నిజమే, ఈ వాంఛ ప్రతి భార్యకు అంత బలంగా వుండకపోవచ్చు, అయితే తప్పుచేయని ఓ భార్య విడాకులను గూర్చి ఆలోచిస్తూవుంటే, హవ్వనుండి తమకు వారసత్వంగా లభించిన భావోద్రేక అవసరతలను పరిగణలోనికి తీసుకోవడం జ్ఞానయుక్తం. అయితే, వివాహేతర లైంగిక దోషంగల వ్యక్తి మూలంగా తప్పుచేయని వ్యక్తికి ఎయిడ్స్‌తోసహా, సుఖరోగాలు సోకే అవకాశమున్నందున కొందరు యేసు వివరించినట్లుగా విడాకులు తీసుకోవడానికే నిర్ణయించుకున్నారు.

  • వివాహబంధాలను ఎలా పటిష్ఠపరచుకోవాలి
    కావలికోట—1993 | ఆగస్టు 15
    • ఆదాము హవ్వలపై యెహోవా విధించిన తీర్పు, పెరుగుతున్న కష్టాల్లోగల మరో వాస్తవాన్ని వెల్లడించింది. భర్తతో తనకుండే సంబంధాన్ని గూర్చి యెహోవా హవ్వతో యిలా చెప్పాడు: “అతడు నిన్ను ఏలును.” మన మొదటి శీర్షికలో ప్రస్తావించబడిన ఈసావొ వలెనే నేడు అనేకమంది భర్తలు తమ భార్యల భావాల్ని ఏ మాత్రం పట్టించుకోకుండ వారిపై అధికారం చెలాయిస్తుంటారు. అయిననూ, అనేకమంది భార్యలు తమ భర్తల శ్రద్ధ చూరగొనాలనే వాంఛ కలిగియున్నారు. ఆ వాంఛ తీరనప్పుడు, భార్యలు అటువంటి శ్రద్ధను గట్టిగా అడుగుచు స్వార్థంతో ప్రవర్తిస్తారు. అనేకమంది భర్తలు అధికారం చెలాయిస్తున్నందున, అనేకమంది భార్యలు తమ భర్తల శ్రద్ధ చూరగొనాలనే వాంఛ కలిగివున్నందున, స్వార్థం చోటుచేసుకొని, ప్రశాంతత లేకుండాపోతుంది. “హౌటు అనలైజ్‌ టుడేస్‌ డివోర్సెస్‌” అనే పేపరునందు షూన్‌స్కె సెరెజావె యిలా చెప్పాడు: “ఈ విషయంలో ఇమిడియున్న ప్రాథమిక సమస్యను అనగా ప్రజలెక్కువగా తమ స్వార్థాన్నే చూసుకుంటారనే విషయాన్ని మనం లక్ష్యపెట్టకపోతే, నేటి విడాకుల విషయం విశ్లేషణ ఒక్కసారిగా అసాధ్యమౌతుంది.”

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి