కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మనం మన దేవుడైన యెహోవా నామమును స్మరిస్తూ నడుచుకుందాం
    కావలికోట—2005 | సెప్టెంబరు 1
    • మనం మన దేవుడైన యెహోవా నామమును స్మరిస్తూ నడుచుకుందాం

      “మనమైతే మన దేవుడైన యెహోవా నామము నెల్లప్పుడును స్మరించుకొందుము.”​—మీకా 4:5.

      1. నైతిక విషయానికొస్తే, నోవహు కాలంలో పరిస్థితి ఎలావుంది, నోవహు ఎలా భిన్నమైన వ్యక్తిగా ఉన్నాడు?

      దేవునితో నడిచిన మొదటి వ్యక్తిగా బైబిల్లో పేర్కొనబడిన వ్యక్తి హనోకు. రెండవ వ్యక్తి నోవహు. ఆ నివేదిక మనకిలా చెబుతోంది: “నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితోకూడ నడచినవాడు.” (ఆదికాండము 6:9) నోవహు కాలానికల్లా, సాధారణ ప్రజానీకం స్వచ్ఛారాధన నుండి వైదొలగిపోయింది. నమ్మకద్రోహులైన దేవదూతలు మానవ స్త్రీలతో అసహజమైన సంబంధాలు ఏర్పరచుకొని, ఆ కాలంలో “బలశాలురు” లేదా “శూరులు” అని పిలువబడిన నెఫీలులను కనడంతో పరిస్థితి మరింత దిగజారిపోయింది. కాబట్టి భూమి దౌర్జన్యంతో నిండిపోయిందంటే అందులో ఆశ్చర్యమేమీ లేదు. (ఆదికాండము 6:2, 4, 11) అయినప్పటికీ, నోవహు నిందారహితునిగా, “నీతిని ప్రకటించిన” వ్యక్తిగా నిరూపించుకున్నాడు. (2 పేతురు 2:5) ప్రాణ రక్షణ కోసం ఓడను నిర్మించమని దేవుడు నోవహుకు ఆజ్ఞాపించినప్పుడు, ఆయన విధేయతతో ‘దేవుడు తనకు ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు.’ (ఆదికాండము 6:22) అవును, నోవహు దేవునితో నడిచాడు.

      2, 3. నేడు మన కోసం నోవహు ఎలాంటి చక్కని ఆదర్శాన్ని ఉంచాడు?

      2 నమ్మకమైన సాక్షుల్లో నోవహును కూడా పేర్కొంటూ పౌలు ఇలా వ్రాశాడు: “విశ్వాసమునుబట్టి నోవహు అదివరకు చూడని సంగతులనుగూర్చి దేవునిచేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై, తన యింటివారి రక్షణకొరకు ఒక ఓడను సిద్ధముచేసెను; అందువలన అతడు లోకముమీద నేరస్థాపన చేసి విశ్వాసమునుబట్టి కలుగు నీతికి వారసుడాయెను.” (హెబ్రీయులు 11:7) ఎంత అద్భుతమైన ఆదర్శమో కదా! యెహోవా మాటలు నిజమవుతాయనే నమ్మకంతో నోవహు దేవుని ఆజ్ఞలను నెరవేర్చడానికి తన సమయాన్ని, శక్తిని, వనరులను వెచ్చించాడు. అదే ప్రకారంగా నేడు చాలామంది లోకసంబంధ అవకాశాలను నిరాకరిస్తూ, దేవుని ఆజ్ఞలకు విధేయులవుతూ తమ సమయాన్ని, శక్తిని, వనరులను వెచ్చిస్తున్నారు. వారి విశ్వాసం గమనార్హమైనదే కాక వారికీ, ఇతరులకూ రక్షణను తీసుకొస్తుంది.​—లూకా 16:9; 1 తిమోతి 4:16.

      3 ముందరి ఆర్టికల్‌లో చర్చించిన నోవహు ముత్తాత అయిన హనోకుకు విశ్వాసంతో ఉండడం ఎంత కష్టమైందో, నోవహుకు ఆయన కుటుంబానికీ అంతే కష్టమై ఉండవచ్చు. హనోకు కాలంలోలాగే నోవహు కాలంలో కూడా సత్యారాధకులు కొద్దిమందే అంటే ఎనిమిది మంది మాత్రమే తాము నమ్మకస్థులమని నిరూపించుకొని జలప్రళయం నుండి తప్పించుకున్నారు. నోవహు దౌర్జన్యపూరితమైన, అనైతిక ప్రపంచంలో నీతిని ప్రకటించాడు. అంతేకాక, ఆయనా ఆయన కుటుంబమూ అంతకుముందెప్పుడూ ఎవరూ అలాంటి జలప్రళయం చూడకపోయినా, ప్రపంచవ్యాప్త జలప్రళయానికి సిద్ధపడుతూ చెక్కలతో పెద్ద ఓడను నిర్మించారు. అది చూపరులకు వింతగా అనిపించి ఉండవచ్చు.

      4. నోవహు సమకాలీనులు చేసిన ఏ తప్పును యేసు నొక్కిచెప్పాడు?

      4 ఆసక్తికరమైన విషయమేమిటంటే, దౌర్జన్యం, అబద్ధమతం లేదా అనైతికత చాలా గంభీరమైనవే అయినప్పటికీ, యేసు నోవహు కాలం గురించి మాట్లాడినప్పుడు వాటి గురించి మాట్లాడలేదు. ప్రజలకు ఇవ్వబడిన హెచ్చరికను వారు నిర్లక్ష్యం చేశారనే తప్పునే యేసు నొక్కిచెప్పాడు. “వారు తినుచు త్రాగుచు, పెండ్లి చేసికొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి” అని ఆయన అన్నాడు. తినడం, త్రాగడం, వివాహం చేసుకోవడం, వంటివాటిలో తప్పేమిటి? వారు కేవలం “సాధారణ” జీవితమే జీవిస్తున్నారు! కానీ జలప్రళయం రాబోతోంది, నోవహు నీతిని ప్రకటిస్తున్నాడు. ఆయన మాటలు, ప్రవర్తన వారికొక హెచ్చరికగా ఉండాల్సింది. అయినప్పటికీ, వారు “జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి.”​—మత్తయి 24:38, 39.

      5. నోవహుకు, ఆయన కుటుంబానికీ ఎలాంటి లక్షణాలు అవసరమయ్యాయి?

      5 వెనక్కి తిరిగి ఆ కాలాల గురించి ఒకసారి ఆలోచిస్తే, నోవహు అవలంబించిన విధానంలోని విజ్ఞతను మనం చూస్తాం. అయితే, జలప్రళయానికి ముందరి దినాల్లో, ప్రతీవారికి భిన్నంగా ఉండేందుకు ధైర్యం అవసరమైంది. పెద్ద ఓడను నిర్మించి దానిలో వివిధ జంతుజాలాలను నింపడానికి నోవహుకు ఆయన కుటుంబానికి దృఢనమ్మకం అవసరమైంది. ఆ నమ్మకస్థుల్లో కొందరు విభిన్నంగా ఉండకుండా “సాధారణ” జీవితం జీవించాలని కోరుకుని ఉండే అవకాశం ఉందా? ఒకవేళ వారికి అలాంటి ఆలోచనలు వచ్చినప్పటికీ, వారు తమ యథార్థతలో బలహీనులు కాలేదు. ఈ విధానంలో మనలో ఎవరమైనా సహించవలసిన కాలంకన్నా మరెంతో ఎక్కువ కాలం సహించిన తర్వాతే, నోవహు చూపించిన విశ్వాసం ఆయన జలప్రళయం నుండి రక్షించబడేందుకు దారితీసింది. అయితే “సాధారణ” జీవితం గడుపుతూ, తాము జీవిస్తున్న కాలాల విశేషతను ఎరగని వారందరికీ యెహోవా తీర్పు తీర్చాడు.

  • మనం మన దేవుడైన యెహోవా నామమును స్మరిస్తూ నడుచుకుందాం
    కావలికోట—2005 | సెప్టెంబరు 1
    • మనం యెహోవా హెచ్చరికలను గమనిస్తాం

      9. జలప్రళయానికి ముందున్న లోకానికీ, నేటి లోకానికీ ఎలాంటి పోలిక ఉంది?

      9 నోవహు కాలంలో దుష్ట మానవులు, నెఫీలులతో కలిసి చేస్తున్న తీవ్ర దౌర్జన్యం కారణంగా, యెహోవా ఆ మానవజాతిని నాశనం చేశాడు. మరి నేటి విషయమేమిటి? అప్పటికంటే ఇప్పుడు దౌర్జన్యమేమైనా తక్కువగా ఉందా? ఎంతమాత్రం తక్కువ లేదు! అంతేకాక, నోవహు కాలంలోలాగే నేడు ప్రజలు తమ దైనందిన వ్యవహారాల్లో మునిగి “సాధారణ” జీవితం జీవించడానికే ప్రయత్నిస్తూ, వారికివ్వబడుతున్న హెచ్చరికలను లక్ష్యపెట్టడం లేదు. (లూకా 17:26, 27) యెహోవా మళ్ళీ మానవాళిని నాశనం చేస్తాడనే విషయాన్ని సందేహించడానికి కారణమేమైనా ఉందా? లేదు.

      10. (ఎ) బైబిలు ప్రవచనాల్లో పదేపదే ఏ హెచ్చరిక ఇవ్వబడింది? (బి) నేడు అనుసరించవలసిన ఏకైక జ్ఞానయుక్త విధానమేమిటి?

      10 జలప్రళయానికి వందల సంవత్సరాల ముందే హనోకు, మన కాలంలో రానున్న నాశనం గురించి ప్రవచించాడు. (యూదా 14, 15) యేసుకూడా రానున్న ‘మహాశ్రమ’ గురించి మాట్లాడాడు. (మత్తయి 24:21) ఇతర ప్రవక్తలూ ఆ సమయం గురించి హెచ్చరించారు. (యెహెజ్కేలు 38:18-23; దానియేలు 12:1; యోవేలు 2:31, 32) ప్రకటన గ్రంథంలో ఆ చివరి నాశనం గురించిన స్పష్టమైన వర్ణనను మనం చదువుతాం. (ప్రకటన 19:11-21) ఆయా వ్యక్తులుగా మనం నోవహును అనుకరిస్తూ, చురుకుగా నీతిని ప్రకటించేవారిగా ఉన్నాం. యెహోవా హెచ్చరికలను ఎరిగినవారిగా ఉంటూ, మన పొరుగువారు కూడా అలా ఎరిగి ఉండాలని వారికి ప్రేమపూర్వకంగా సహాయం చేస్తాం. కాబట్టి నోవహులాగే మనం కూడా దేవునితో నడుస్తాం. నిజానికి, జీవాన్ని కోరుకునే ప్రతీవ్యక్తీ దేవునితో నడవడం ఆవశ్యకం. అయితే మనం ప్రతీరోజు ఎదుర్కొనే ఒత్తిళ్ల మధ్య కూడా ఆయనతో ఎలా నడవవచ్చు? అందుకు మనం దేవుని సంకల్పం తప్పకుండా నెరవేరుతుందని బలమైన విశ్వాసాన్ని పెంపొందించుకోవడం అవసరం.​—హెబ్రీయులు 11:6.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి