-
నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?బైబిలు ప్రశ్నలకు జవాబులు
-
-
నోవహు ఓడ ఎలా ఉండేది?
ఓడ దీర్ఘచతురస్రాకారంలో పెద్ద పెట్టెలా ఉండేది. దాని పొడవు దాదాపు 133 మీటర్లు (437 అడుగులు), వెడల్పు 22 మీటర్లు (73 అడుగులు), ఎత్తు 13 మీటర్లు (44 అడుగులు).a దాన్ని చితిసారకపు మ్రానుతో చేసి లోపల, బయట కీలు పూశారు. అందులో మూడు అంతస్థులు, చాలా గదులు ఉండేవి. దానికి ఒకవైపు తలుపు ఉండేది; పైకప్పుకు దగ్గర్లో, దాని పొడవునా ఒక కిటికీ ఉండవచ్చు. ఓడ మీద పడే నీళ్లు కారిపోయేలా, ఆ పైకప్పు మధ్యలో కాస్త ఎత్తుగా, అంచుల వైపు ఏటవాలుగా ఉండివుండవచ్చు.—ఆదికాండము 6:14-16.
-
-
నోవహు, జలప్రళయం కథ నిజమా? లేదా కట్టుకథా?బైబిలు ప్రశ్నలకు జవాబులు
-
-
a బైబిలు ఓడ కొలతల్ని మూరల్లో చెప్తుంది. “ప్రామాణిక హీబ్రూ మూర 17.5 అంగుళాలు (44.45 సెంటీమీటర్లు) ఉండేది.”—ద ఇలస్ట్రేటెడ్ బైబిల్ డిక్షనరీ, రివైజ్డ్ ఎడిషన్, 3వ భాగం, 1635వ పేజీ.
-