క్రైస్తవ జీవితం, పరిచర్య మీటింగ్ వర్క్‌బుక్ రెఫరెన్సులు
ఆగస్టు 3-9
దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 13-14
“స్థిరంగా నిలబడి, యెహోవా మిమ్మల్ని ఎలా రక్షిస్తాడో చూడండి”
మోషే విశ్వాసంగల వ్యక్తి
యెహోవా ఇంకాసేపట్లో ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చీలుస్తాడని, ఇశ్రాయేలీయులు తప్పించుకోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేస్తాడని మోషేకు తెలిసివుండకపోవచ్చు. అయినా, దేవుడు తన ప్రజల్ని కాపాడడానికి ఏదో ఒకటి చేస్తాడనే నమ్మకం మోషేకు ఉంది. తోటి ఇశ్రాయేలీయులు కూడా అదే నమ్మకంతో ఉండాలని మోషే కోరుకున్నాడు. ‘భయపడవద్దని, యెహోవా మీకు నేడు కలుగజేసే రక్షణను ఊరికే నిలబడి చూడమని మోషే ప్రజలతో చెప్పాడు’ అని బైబిలు చెబుతోంది. (నిర్గమకాండము 14:13, 14) మరి వాళ్ల విశ్వాసాన్ని మోషే బలపర్చాడా? అవును, బలపర్చాడు! మోషే గురించి, ఇశ్రాయేలీయుల గురించి బైబిలు ఇలా చెబుతోంది: ‘విశ్వాసంతో వారు పొడి నేలమీద నడిచినట్లు ఎర్రసముద్రంలో నడిచి వెళ్లారు.’ (హెబ్రీయులు 11:29) మోషే విశ్వాసం వల్ల ఆయనే కాదు, యెహోవామీద విశ్వాసముంచడం ప్రాముఖ్యమని అర్థం చేసుకున్నవాళ్లంతా ప్రయోజనం పొందారు.
సర్వశక్తిమంతుడే అయినా మనల్ని అర్థంచేసుకుంటాడు
13 నిర్గమకాండము 14:19-22 చదవండి. మీరు ఇశ్రాయేలీయులతో ఉన్నట్లు ఊహించుకోండి. వెనకేమో ఐగుప్తీయుల సైన్యం, ముందేమో ఎర్ర సముద్రం, ఆ రెండింటి మధ్య మీరు చిక్కుకుపోయారు. అప్పుడే దేవుడు చర్య తీసుకున్నాడు. మీకు ముందుండి నడిపిస్తున్న మేఘస్తంభం ఇప్పుడు వెనక్కి వెళ్లి మీకూ, ఐగుప్తీయులకూ మధ్య నిలిచింది. దానివల్ల వాళ్లకంతా చీకటిగా ఉంది, కానీ మీకు అద్భుతరీతిలో వెలుగు ప్రకాశించింది! ఆ తర్వాత మోషే సముద్రం వైపు చేయి చాపడం, బలమైన తూర్పు గాలి రావడం, అవతలి ఒడ్డుకు వెళ్లేలా విశాలమైన మార్గం తెరుచుకోవడం మీరు చూశారు. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ పశువులు మిగతా ప్రజలతో కలిసి సముద్రపు నేలమీద ఒక క్రమపద్ధతిలో నడుస్తున్నారు. ఆ నేల బురదగా, జారుతున్నట్లు లేకపోవడం చూసి మీరు ఆశ్చర్యపోయారు. నేల పొడిగా, గట్టిగా ఉంది కాబట్టి నడవడానికి సౌకర్యంగా ఉంది. దానివల్ల, నిదానంగా నడిచేవాళ్లు కూడా సురక్షితంగా అవతలి ఒడ్డుకు చేరుకోగలిగారు.
మీరు యెహోవాను మరచిపోకూడదు
ఒకవైపు ఊడిపోయిన తమ రథచక్రాలతో ఐగుప్తీయులు పోరాడుతుంటే మరోవైపు ఇశ్రాయేలయులందరూ తూర్పుతీరానికి చేరుకున్నారు. మోషే ఎర్ర సముద్రంపై తన చేయి చాపినప్పుడు అప్పటివరకూ ఇరువైపుల గోడలావున్న నీళ్లను తిరిగి పొర్లేలా యెహోవా చేశాడు. లక్షల టన్నుల నీళ్లు ఫరోనూ అతని సైన్యాన్నీ ముంచివేశాయి. ఆ శత్రువుల్లో ఏ ఒక్కరూ మిగల్లేదు. ఇశ్రాయేలీయులు విడుదల పొందారు.—నిర్గ. 14:26-28; కీర్త. 136:13-15.
ఆ సంఘటన గురించిన వార్త విని చుట్టుప్రక్కల జనాంగాలు ఎంతోకాలం వరకు భయపడ్డారు. (నిర్గ. 15:14-16) నలభై సంవత్సరాల తర్వాత యెరికోకు చెందిన రాహాబు ఇద్దరు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పింది: ‘మీవలన మాకు భయము పుట్టెను. మీరు ఐగుప్తు దేశములోనుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్రసముద్రపు నీరును ఏలాగు ఆరిపోచేసెనో మేము విన్నాం.’ (యెహో. 2:9, 10) యెహోవా తన ప్రజల్ని విడిపించిన తీరును అన్య జనాంగాలు కూడ మరచిపోలేదు. ఆయనను గుర్తుంచుకోవడానికి ఇశ్రాయేలీయులకు ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
it-1-E 1117
రహదారి, రోడ్డు
ప్రాచీన కాలాల నుండి పాలస్తీనా ప్రాంతంలోని రహదారులు, రోడ్లు, కొన్ని ముఖ్యమైన వర్తక మార్గాలు నగరాలను, రాజ్యాలను కలిపేవి. (సం 20:17-19; 21:21, 22; 22:5, 21-23; యెహో 2:22; న్యా 21:19; 1స 6:9, 12; 13:17, 18) ప్రధాన మార్గం అని పరిగణించబడుతున్న ఒక దారి ఐగుప్తు నుండి ఫిలిష్తీయ నగరాలైన గాజా, అష్కెలోనుకు వెళ్తూ, మెల్లగా ఈశాన్యంగా మెగిద్దో వైపుకు మళ్లేది. అక్కడినుండి అది హాసోరుకు, గలిలయ సముద్రం ఉత్తర ప్రాంతానికి, ఆ తర్వాత దమస్కుకు వెళ్లేది. ఫిలిష్తీయ గుండా వెళ్లే ఈ దారిలో ప్రయాణిస్తే ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి త్వరగా వెళ్లిపోవచ్చు. కానీ, ఫిలిష్తీయులు దాడి చేస్తే ఇశ్రాయేలీయులు భయపడిపోతారని యెహోవా వాళ్లను దయగా మరో మార్గంలో నుండి తీసుకెళ్లాడు.—నిర్గ 13:17.
it-1-E 782వ పేజీ, 2-3 పేరాలు
ఐగుప్తు నుండి విడుదల
ఇశ్రాయేలీయులు దాటగలిగేలా ఎర్ర సముద్రం ఎక్కడ పాయలు చేయబడింది?
ఇశ్రాయేలీయులు తమ ప్రయాణంలోని రెండవ దశకు చేరుకున్నాక, అంటే “ఎడారి అంచున ఉన్న ఏతాము” దగ్గరికి చేరుకున్నాక, వాళ్లు “వెనక్కి తిరిగి పీహహీరోతు ముందు . . . సముద్రం దగ్గర . . . డేరాలు వేసుకోవాలి” అని దేవుడు మోషేకు చెప్పాడు. అలా చేయడం వల్ల ఇశ్రాయేలీయులు “దారి తప్పిపోయి తిరుగుతున్నారు” అని ఫరో అనుకున్నాడు. (నిర్గ 13:20; 14:1-3) ఇశ్రాయేలీయులు ఎల్ హజ్ మార్గంలో ప్రయాణించివుంటారని చెప్పే పండితులు “వెనక్కి తిరిగి” అని అనువదించబడిన హీబ్రూ క్రియాపదం, కేవలం “మళ్లడం” లేదా “పక్కకు తిరగడం” కాదుగానీ వెనుదిరగడాన్ని లేదా కనీసం కొంతదూరమైనా వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లడాన్ని సూచిస్తుందని చెప్తారు. ఇశ్రాయేలీయులు సూయజ్ సింధుశాఖ ఉత్తరానికి చేరుకున్నాక, వాళ్లు వెనక్కి తిరిగి, ఆ సింధుశాఖ పశ్చిమాన ఉన్న జెబెల్ ʽఅతాకా పర్వతాల తూర్పు వైపుకు వెళ్లారు. ఇలాంటి స్థితిలో ఉత్తర దిక్కునుండి ఇశ్రాయేలీయులపై దాడి జరిగితే వాళ్లు చాలామంది ఉన్నారు కాబట్టి త్వరగా తప్పించుకోలేరు. సముద్రం అడ్డుగా ఉండడంతో వాళ్లు ఎటూ కదల్లేని పరిస్థితిలో ఉండేవాళ్లు.
క్రీ.శ. మొదటి శతాబ్దంలో యూదులు కూడా అదే నమ్మేవాళ్లు. మరిముఖ్యంగా, చాలామంది పండితులు ఒప్పుకోకపోయినా బైబిల్లో చెప్పినదానికి అది సరిగ్గా సరిపోతుంది. (నిర్గ 14:9-16) ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రపు సింధుశాఖ ముఖభాగానికి (లేదా ఎర్ర సముద్రం పడమటి శాఖకు) చాలా దూరంలో దాటివుంటారని స్పష్టంగా తెలుస్తోంది, లేకపోతే ఫరో సైన్యం చుట్టు తిరిగొచ్చి అవతలి వైపున ఆ సింధుశాఖ కొన దగ్గర ఇశ్రాయేలీయులపై సులువుగా దాడి చేసి ఉండేవాళ్లు.—నిర్గ 14:22, 23.
ఆగస్టు 10-16
దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 15-16
“పాటలు పాడుతూ యెహోవాను స్తుతించండి”
సత్య దేవునికి ఇప్పుడే ఎందుకు భయపడాలి?
11 ఐగుప్తీయుల సైనిక శక్తులను యెహోవా నాశనం చేయడం, తన ఆరాధికుల దృష్టిలో ఆయనను ఉన్నతపర్చింది మరియు ఆయన నామం నలుమూలలా తెలిసింది. (యెహోషువ 2:9, 10; 4:23, 24) అవును, తమ ఆరాధికులను విడిపించలేమని నిరూపించుకున్న ఐగుప్తు అబద్ధ దేవుళ్ల శక్తిహీనతకుపైగా ఆయన నామం ఉన్నతమైంది. తమ దేవతల్లోనూ మరియు మృతతుల్య మానవునిలోనూ మరియు సైనిక శక్తిలోనూ వారి విశ్వాసం ఘోరమైన నిరాశకు దారితీసింది. (కీర్తన 146:3) తన ప్రజలను బలమైనరీతిలో విమోచించే సజీవ దేవుని ఎడల ఆరోగ్యకరమైన భయాన్ని ప్రతిబింబించే స్తుతిగానాలను పాడేందుకు ఇశ్రాయేలీయులు కదిలించబడ్డారనడంలో ఆశ్చర్యంలేదు!
w95 10/15 11-12 పేజీలు, 15-16 పేరాలు
సత్య దేవునికి ఇప్పుడే ఎందుకు భయపడాలి?
15 మనం మోషేతో భద్రంగా నిలుచున్నట్లైతే, “యెహోవా, వేల్పులలో నీవంటివాడెవడు పరిశుద్ధతనుబట్టి నీవు మహానీయుడవు స్తుతికీర్తనలనుబట్టి పూజ్యుడవు అద్భుతములు చేయువాడవు నీవంటివాడెవడు” అని పాడేందుకు కదిలించబడతాము. (నిర్గమకాండము 15:11) ఆ నాటినుండి అలాంటి మనోభావనలు శతాబ్దాలుగా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. బైబిల్లోని చివరి పుస్తకంలో అపొస్తలుడైన యోహాను, దేవుని నమ్మకమైన అభిషక్త సేవకుల గుంపును వర్ణిస్తున్నాడు: “దేవునిదాసుడగు మోషే కీర్తనయు గొఱ్ఱెపిల్ల కీర్తనయు పాడుచున్నారు.” ఈ గొప్ప కీర్తన ఏమిటి? “ప్రభువా, దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా, నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి; ప్రభువా, నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడనివాడెవడు? నీ నామమును మహిమపరచనివాడెవడు?”—ప్రకటన 15:2-4.
16 నేడుకూడా దేవుని చేతిపనులనే కాక ఆయన ఆదేశాలను కూడా మెచ్చుకునే విడిపించబడిన ఆరాధికులున్నారు. అన్ని జనాంగాల్లోని ప్రజలు ఈ కలుషితమైన ప్రపంచంనుండి ఆత్మీయంగా విమోచించబడి వేరుచేయబడ్డారు, ఎందుకంటే వారు దేవుని నీతియుక్తమైన ఆదేశాలను గ్రహించి, వాటిని క్రియల్లో కనపర్చారు. ప్రతి సంవత్సరం, లక్షలాది మంది ఈ అవినీతికరమైన లోకాన్ని విడిచి యెహోవా ఆరాధికుల పరిశుభ్రమైన, సరైన సంస్థతో సహవసిస్తున్నారు. వెంటనే, అబద్ధ మతం మరియు మిగతా దుష్టవిధానంపై దేవుడు తీవ్రమైన తీర్పులు తీర్చిన వెంటనే వారు నీతియుక్తమైన నూతన లోకంలో నిరంతరం జీవిస్తారు.
it-2-E 454వ పేజీ, 1వ పేరా
సంగీతం
ఇశ్రాయేలీయుల గాయక బృందాలు ఒక ప్రత్యేక పద్ధతిలో పాడేవాళ్లు. ఒక బృందం పాటలో కొంత భాగాన్ని పాడాక ఇంకో బృందం పాటలో తర్వాతి భాగాన్ని పాడేవాళ్లు. లేదా ఒకరు పాడాక, దానికి జవాబుగా ఒక బృందం పాటను అందుకునేది. ఇలా బృందాలుగా ఒకళ్ల తర్వాత ఒకళ్లు పాడేవాళ్లు. ఈ పద్ధతిని సూచించడానికే “స్పందిస్తూ” అనే మాట ఉపయోగించబడిందని అర్థమౌతుంది. (నిర్గ 15:21; 1స 18:6, 7) కొన్ని కీర్తనల్ని, ఉదాహరణకు 136వ కీర్తనని రాసిన విధానాన్ని బట్టి వాళ్లు ఈ పద్ధతిలో పాడేవాళ్లని అర్థమౌతుంది. నెహెమ్యా కాలంలో “కృతజ్ఞతా గీతాలు పాడే రెండు పెద్ద బృందాలు” యెరూషలేము ప్రాకారాన్ని ప్రతిష్ఠించేటప్పుడు పైన చెప్పిన పద్ధతిలోనే పాడి ఉంటారు.—నెహె 12:31, 38, 40-42.
it-2-E 698
ప్రవక్త్రి
బైబిల్లో మొదటి ప్రవక్త్రి మిర్యాము. దేవుడు ఆమె ద్వారా ఒక సందేశాన్ని లేదా కొన్ని సందేశాల్ని దైవప్రేరిత పాటల రూపంలో తెలియజేసి ఉంటాడు. (నిర్గ 15:20, 21) అందుకే ఆమె, అహరోను మోషేతో ఇలా అన్నారు: “మా ద్వారా కూడా [యెహోవా] మాట్లాడాడు కదా?” (సం 12:2) ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తీసుకొస్తున్నప్పుడు “మోషేను, అహరోనును, మిర్యామును” వాళ్ల ముందు పంపించానని యెహోవాయే స్వయంగా మీకా ప్రవక్త ద్వారా అన్నాడు. (మీకా 6:4) దైవిక సందేశాల్ని చేరవేసే గొప్ప అవకాశం మిర్యాము పొందినా, ఈ విషయంలో ఆమె స్థానం తన తమ్ముడైన మోషేకు ఉన్న స్థానం కన్నా గొప్పది కాదు. ఆమె తన స్థానాన్ని మర్చిపోయి మాట్లాడినప్పుడు దేవుడు ఆమెను తీవ్రంగా గద్దించాడు.—సం 12:1-15.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
w11-E 9/1 14
మీకు తెలుసా?
ఎడారిలో యెహోవా ఇశ్రాయేలీయులకు ఆహారం ఇవ్వడానికి పూరేడు పిట్టల్ని ఎందుకు ఉపయోగించి ఉంటాడు?
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటికి వచ్చిన తర్వాత, యెహోవా రెండు సందర్భాల్లో పూరేడు పిట్టల్ని ఉపయోగించి వాళ్లకు సమృద్ధిగా మాంసం పెట్టాడు.—నిర్గమకాండం 16:13; సంఖ్యాకాండం 11:31.
పూరేడు పిట్టలు చిన్నగా ఉంటాయి. అవి దాదాపు 7 అంగుళాల (18 సెంటీమీటర్ల) పొడవు, దాదాపు 100 గ్రాముల బరువు ఉంటాయి. పశ్చిమ ఆసియా అలాగే ఐరోపాలోని చాలా ప్రాంతాల్లో అవి పిల్లల్ని పెడతాయి. అవి వలస పక్షులు కాబట్టి చలికాలం అంతా ఉత్తర ఆఫ్రికాలో, అరేబియాలో గడుపుతాయి. వలస వెళ్లేటప్పుడు అవి గుంపులుగుంపులుగా మధ్యధరా సముద్రపు తూర్పు తీరాల్ని దాటి, సీనాయి ద్వీపకల్పం మీదుగా వెళ్తాయి.
ద న్యూ వెస్ట్‌మిన్‌స్టర్ డిక్షనరీ ఆఫ్ ద బైబిల్ చెప్తున్నట్టు, పూరేడు పిట్టలు “వేగంగా ఎగురుతాయి, బాగా ఎగురుతాయి. గాలిని అవి చక్కగా ఉపయోగించుకుంటాయి; కానీ గాలి వీచే దిశ మారినప్పుడు లేదా సుదూర ప్రయాణం వల్ల పక్షులు అలసిపోయినప్పుడు, మొత్తం పక్షుల గుంపంతా నేల మీద పడిపోయి, చలనం లేకుండా ఉండిపోతుంది.” అవి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాలంటే, నేల మీద ఒకట్రెండు రోజులు విశ్రాంతి తీసుకోవాలి. కాబట్టి అవి వేటగాళ్లకు త్వరగా దొరికిపోతాయి. 20వ శతాబ్దం తొలినాళ్లలో, ఐగుప్తు లేదా ఈజిప్టు ప్రతీ సంవత్సరం దాదాపు 30 లక్షల పూరేడు పిట్టల్ని ఆహారం కోసం ఎగుమతి చేస్తూ ఉంది.
ఇశ్రాయేలీయులు రెండుసార్లు పూరేడు పిట్టల ద్వారా పోషించబడింది వసంత రుతువులోనే. ఆ సమయంలో పూరేడు పిట్టలు సీనాయి ప్రాంతంలో బాగా తిరుగుతాయి. అయినప్పటికీ తన దగ్గర నుండి “గాలి బయల్దేరి” ఆ పిట్టలు ఇశ్రాయేలీయుల పాలెంలో పడేలా చేసింది యెహోవాయే.—సంఖ్యాకాండం 11:31.
పాఠకుల ప్రశ్నలు
ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విడుదలైన కొంతకాలానికి, ఆహారం విషయంలో సణగడం మొదలుపెట్టారు. కాబట్టి, యెహోవా వారికి మన్నా అనుగ్రహించాడు. (నిర్గమకాండము 12:17, 18; 16:1-5) ఆ సమయంలో, మోషే అహరోనును ఇలా నిర్దేశించాడు: “నీవు ఒక గిన్నెను తీసికొని, దానిలో ఒక ఓమెరు మన్నాను పోసి, మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిలో దాని ఉంచుము.” ఆ వృత్తాంతం ఇలా చెబుతోంది: “యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము [ముఖ్యమైన దస్తావేజులను భద్రంగా ఉంచడానికి ఉపయోగించే స్థలం] ఎదుట అహరోను దాని పెట్టెను.” (నిర్గమకాండము 16:33, 34) ఆ సమయంలో, అహరోను నిస్సందేహంగా మన్నాను పాత్రలో వేసి ఉంచినప్పటికీ, ఆ పాత్రను సాక్ష్యపు మందసము ఎదుట ఉంచడానికి కొంతకాలం ఆగవలసి వచ్చింది. అంటే, మోషే మందసాన్ని తయారుచేసి దానిలో రాతి పలకలను పెట్టే వరకు ఆగవలసి వచ్చింది.
ఆగస్టు 17-23
దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 17-18
“అణకువగల పురుషులు శిక్షణ ఇస్తారు, బాధ్యతలు అప్పగిస్తారు”
మోషే ప్రేమగల వ్యక్తి
మోషే తన తోటి ఇశ్రాయేలీయులను కూడా ప్రేమించాడు. యెహోవా తమను మోషే ద్వారానే నడిపిస్తున్నాడని గుర్తించిన ఇశ్రాయేలీయులు ఏ సమస్య ఎదురైనా మోషే దగ్గరికి వచ్చేవాళ్లు. నిర్గమకాండము 18:13-16 లో ఇలా ఉంది: ‘ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రజలు మోషే వద్ద నిలిచి ఉండిరి.’ మోషే రోజంతా ఇశ్రాయేలీయుల సమస్యల్ని వినీవినీ ఎంతగా అలసిపోయేవాడో ఒక్కసారి ఊహించుకోండి. అయినాసరే మోషే వాళ్లను ప్రేమించాడు కాబట్టి వాళ్లకు సంతోషంగా సహాయం చేశాడు.
సంతోషకరమైన జీవితానికి నమ్మకం ఆవశ్యం
ఈ పురుషులు బాధ్యతాయుతమైన స్థానాల్లో నియమించబడకముందే నిర్దిష్టమైన దైవిక లక్షణాలను ప్రదర్శించారు. తాము దైవభక్తిగలవారమని వారు అప్పటికే నిరూపించుకున్నారు; సృష్టికర్తపట్ల వారికి ఆరోగ్యకరమైన భక్తిభావం ఉండేది, ఆయనను నొప్పించడానికి వారు భయపడేవారు. ఈ పురుషులు దేవుని ప్రమాణాలను సమర్థించడానికి తమకు సాధ్యమైనదంతా చేశారని అందరికి స్పష్టంగా తెలుసు. వారు అన్యాయంగా లభించే లాభాలను ద్వేషించారు, వారికి అధికారం ఇవ్వబడితే దానిని దుర్వినియోగపరచకుండా ఉండగల నైతిక బలం వారికి ఉందని అది సూచించింది. వారు తమ స్వలాభాల కోసం లేదా తమ బంధువుల స్నేహితుల ప్రయోజనార్థం తమపై ఉంచబడిన నమ్మకాన్ని దుర్వినియోగం చేయరు.
(నిర్గమకాండం 18:24, 25) మోషే వెంటనే తన మామ మాట విన్నాడు, అతను చెప్పిందంతా చేశాడు. 25 మోషే ఇశ్రాయేలీయులందరిలో నుండి సమర్థులైన పురుషుల్ని ఎంచుకొని వాళ్లను ప్రజల మీద పెద్దలుగా నియమించాడు; అతను వాళ్లను వెయ్యిమంది మీద, వందమంది మీద, యాభైమంది మీద, పదిమంది మీద ప్రధానులుగా నియమించాడు.
w02 5/15 25వ పేజీ, 6వ పేరా
యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది
మోషే కూడా వినయవిధేయతలుగల వ్యక్తి. ఆయన ఇతరుల సమస్యలపై శ్రద్ధ చూపిస్తూ సతమతమవుతున్నప్పుడు, ఆయన మామ యిత్రో యోగ్యులైన ఇతరులతో కొన్ని బాధ్యతలను పంచుకోమంటూ ఆయనకు ఒక ఆచరణాత్మకమైన పరిష్కారం చూపించాడు. మోషే తన పరిమితులను గుర్తించి, ఆ సలహాను బుద్ధిపూర్వకంగా అంగీకరించాడు. (నిర్గమకాండము 18:17-26; సంఖ్యాకాండము 12:3) వినయంగల ఒక వ్యక్తి, తన అధికారాన్ని ఇతరులతో పంచుకోవడానికి వెనకాడడు, యోగ్యులైన ఇతరులతో తగిన బాధ్యతలను పంచుకోవడంవల్ల ఏదో ఒకవిధంగా తన అధికారం కోల్పోతానేమోనని భయపడడు. (సంఖ్యాకాండము 11:16, 17, 26-29) బదులుగా ఆయన, వారు ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు సహాయం చేయాలన్న కాంక్షతో ఉంటాడు. (1 తిమోతి 4:15) మన విషయంలోనూ అది నిజం కాదా?
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
“నీ చేతులు దించకు”
14 అమాలేకీయులతో యుద్ధం జరుగుతున్న సమయంలో అహరోను, హూరులు మోషే చేతులకు ఊతమిచ్చి ఆయనకు సహాయం చేశారు. నేడు మనం కూడా వేరేవాళ్లకు మద్దతిచ్చి సహాయం చేసే అవకాశాల కోసం వెతకాలి. మన సహోదరుల్లో కొంతమంది వయసు పైబడడంవల్ల, అనారోగ్యంవల్ల, కుటుంబం నుండి వ్యతిరేకతవల్ల, ఒంటరితనంవల్ల, ఇష్టమైనవాళ్లు చనిపోవడంవల్ల బాధపడుతున్నారు. అంతేకాదు తప్పు చేయాలనే లేదా ఈ లోకంలో మంచి పేరును సంపాదించుకోవాలనే ఒత్తిడిని ఎదుర్కొంటున్న మన యౌవనుల్ని కూడా మనం బలపర్చవచ్చు. (1 థెస్స. 3:1-4; 5:11, 14) రాజ్యమందిరంలో, పరిచర్యలో, కలిసి భోజనం చేస్తున్న సమయంలో, ఫోన్‌లో మాట్లాడుతున్న సమయంలో ఇతరులపట్ల నిజమైన శ్రద్ధ చూపించే అవకాశాల కోసం వెదకండి.
it-1-E 406
బైబిలు పుస్తకాల ప్రామాణిక పట్టిక
మోషే రాసిన ఆ పుస్తకాలకు దేవుడే మూలమని, అవి దైవ ప్రేరేపితమైనవని, నమ్మదగినవని, స్వచ్ఛమైన ఆరాధనకు చక్కటి మార్గనిర్దేశం లాంటివని ఆ పుస్తకాల్లోనే ఉన్న వివరాలు రుజువు చేస్తున్నాయి. మోషే ఇశ్రాయేలీయులకు నాయకుడు అలాగే సైన్యాధిపతి అయ్యింది తన సొంత ప్రోద్బలంతో కాదు; నిజానికి దేవుడు ఆ నియామకం ఇస్తున్నప్పుడు అతను దాన్ని తీసుకోవడానికి మొదట వెనకాడాడు. (నిర్గ 3:10, 11; 4:10-14) దేవుడే మోషేను నిలబెట్టాడు, అతనికి అద్భుతమైన శక్తులు ఇచ్చాడు. ఆ శక్తిని చూసినప్పుడు ఫరోకు చెందిన ఇంద్రజాలం చేసే పూజారులు సైతం మోషేను దేవుడు పంపిన వ్యక్తిగా గుర్తించారు. (నిర్గ 4:1-9; 8:16-19) కాబట్టి ఒక వక్త (ఉద్బోధించేవాడు), రచయిత అవ్వాలన్నది మోషే సొంత కోరిక కాదు. బదులుగా మోషే దేవుని ఆజ్ఞకు లోబడుతూ, పవిత్రశక్తి ద్వారా దేవుడు ఇచ్చిన అధికారంతో కొన్ని విషయాల్ని మొదట చెప్పాడు, ఆ తర్వాత రాశాడు. అతను రాసినవి బైబిలు పుస్తకాల ప్రామాణిక పట్టికలో భాగమయ్యాయి.—నిర్గ 17:14.
ఆగస్టు 24-30
దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 19-20
“పది ఆజ్ఞల నుండి మీరేం నేర్చుకోవచ్చు?”
w89-E 11/15 6వ పేజీ, 1వ పేరా
పది ఆజ్ఞల నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
అందులోని మొదటి నాలుగు ఆజ్ఞలు యెహోవాను సంతోషపెట్టాలంటే మనం ఏం చేయాలో గుర్తుచేస్తాయి. (మొదటిది) ఆయన ఇప్పటికీ సంపూర్ణ భక్తిని కోరే దేవుడే. (మత్తయి 4:10) (రెండవది) ఆయన ఆరాధకుల్లో ఎవ్వరూ విగ్రహాల్ని పూజించకూడదు. (1 యోహాను 5:21) (మూడవది) మనం దేవుని పేరును సరైన విధంగా, గౌరవపూర్వకంగా ఉపయోగించాలి గానీ ఎన్నడూ అమర్యాదగా ఉపయోగించకూడదు. (యోహాను 17:26; రోమీయులు 10:13) (నాలుగవది) మన జీవితమంతా పవిత్రమైన విషయాల చుట్టే తిరగాలి. అలాచేస్తే మనం స్వనీతి నుండి “విశ్రాంతి” తీసుకోగలుగుతాం.—హెబ్రీయులు 4:9, 10.
w89-E 11/15 6వ పేజీ, 2-3 పేరాలు
పది ఆజ్ఞల నుండి మీరెలా ప్రయోజనం పొందవచ్చు?
(ఐదవది) పిల్లలు తల్లిదండ్రులకు లోబడడం నేడు కూడా కుటుంబ ఐక్యతకు ఎంతగానో దోహదపడుతుంది. అలా లోబడడం ద్వారా వాళ్లు యెహోవా ఆశీర్వాదాలు పొందవచ్చు. ‘వాగ్దానంతో పాటు ఇవ్వబడిన ఆ మొదటి ఆజ్ఞ’ ఎంత చక్కని నిరీక్షణ ఇస్తుందో కదా! దానివల్ల మన ‘జీవితం బాగుండడమే’ కాదు ‘భూమ్మీద ఎక్కువకాలం జీవిస్తాం.’ (ఎఫెసీయులు 6:1-3) మనం ఈ చెడ్డ వ్యవస్థ “చివరి రోజుల్లో” జీవిస్తున్నాం కాబట్టి, పిల్లలు ఆ విధంగా దేవునికి లోబడితే శాశ్వతకాలం జీవించే అవకాశం పొందుతారు.—2 తిమోతి 3:1; యోహాను 11:26.
సాటిమనిషి మీద ప్రేమ ఉంటే (ఆరవది) హత్య, (ఏడవది) వ్యభిచారం, (ఎనిమిదవది) దొంగతనం, (తొమ్మిదవది) అబద్ధ సాక్ష్యాలు చెప్పడం వంటి చెడ్డ పనులకు దూరంగా ఉంటాం. (1 యోహాను 3:10-12; హెబ్రీయులు 13:4; ఎఫెసీయులు 4:28; మత్తయి 5:37; సామెతలు 6:16-19) మరి మన ఉద్దేశాల సంగతేంటి? ఇతరులకు చెందినవాటిని ఆశించకూడదనే (పదవ) ఆజ్ఞ, మన ఉద్దేశాలు ఎప్పుడూ ఆయన దృష్టికి సరైనవిగా ఉండాలని మనకు గుర్తుచేస్తుంది.—సామెతలు 21:2.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
it-2-E 687వ పేజీ, 1-2 పేరాలు
యాజకుడు
క్రైస్తవ యాజకత్వం. ఇశ్రాయేలీయులు తన ఒప్పందానికి కట్టుబడి ఉంటే, వాళ్లు తనకు “యాజకులతో రూపొందిన రాజ్యంగా, పవిత్ర జనంగా” తయారౌతారని యెహోవా మాటిచ్చాడు. (నిర్గ 19:6) అయితే, అహరోను యాజకత్వం రాబోయే గొప్ప యాజకత్వానికి నీడ మాత్రమే కాబట్టి ఆ గొప్ప యాజకత్వం వచ్చేవరకే అది కొనసాగుతుంది. (హెబ్రీ 8:4, 5) ధర్మశాస్త్ర ఒప్పందం ముగిసి కొత్త ఒప్పందం స్థాపించబడే వరకు అది కొనసాగుతుంది. (హెబ్రీ 7:11-14; 8:6, 7, 13) యెహోవా వాగ్దానం చేసిన రాజ్య ఏర్పాటులో దేవుని యాజకులుగా ఉండే అవకాశం మొదట ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది; తర్వాత్తర్వాత అది అన్యులకు కూడా ఇవ్వబడింది.—అపొ 10:34, 35; 15:14; రోమా 10:21.
యూదుల్లో కొంతమంది మాత్రమే క్రీస్తును అంగీకరించారు. అలా ఆ జనాంగం “యాజకులతో రూపొందిన రాజ్యంగా, పవిత్ర జనంగా” ఏర్పడే నిజమైన సభ్యుల్ని అందించలేకపోయింది. (రోమా 11:7, 20) ఇశ్రాయేలీయులు నమ్మకంగా లేనందుకు దేవుడు వందల సంవత్సరాల క్రితమే హోషేయ ప్రవక్త ద్వారా వాళ్లను ఇలా హెచ్చరించాడు: “మీరు జ్ఞానాన్ని తిరస్కరించారు కాబట్టి, నాకు యాజకునిగా సేవ చేయకుండా నేను కూడా మిమ్మల్ని తిరస్కరిస్తాను; మీ దేవుని ధర్మశాస్త్రాన్ని మీరు మర్చిపోయారు కాబట్టి, నేను కూడా మీ కుమారుల్ని మర్చిపోతాను.” (హోషే 4:6) అందుకే యేసు యూదా నాయకులతో ఇలా అన్నాడు: “దేవుడు తన రాజ్యాన్ని మీ దగ్గర నుండి తీసేసి, రాజ్యానికి తగిన ఫలాలు ఫలించే జనానికి ఇస్తాడు.” (మత్త 21:43) అయితే, యేసుక్రీస్తు భూమ్మీద జీవించినప్పుడు ఆయన ఇంకా ధర్మశాస్త్రం కిందే ఉన్నాడు కాబట్టి అహరోను యాజకత్వాన్ని గౌరవించాడు. అందుకే తాను బాగుచేసిన కుష్ఠురోగుల్ని యాజకునికి కనిపించి, మోషే ధర్మశాస్త్రం చెప్పిన అర్పణ అర్పించమని అన్నాడు.—మత్త 8:4; మార్కు 1:44; లూకా 17:14.
నిర్గమకాండములోని ముఖ్యాంశాలు
20:5—“తండ్రుల దోషమును” వారి భావి తరాలపై యెహోవా తీసుకురావడం అంటే దానర్థమేమిటి? ప్రతి వ్యక్తి బాధ్యతగల ఒక వయసుకు వచ్చాక అతను తన ప్రవర్తన, దృక్పథం ఆధారంగానే తీర్పు తీర్చబడతాడు. అయితే ఇశ్రాయేలు జనాంగం విగ్రహారాధన వైపు తిరిగినప్పుడు, దాని పర్యవసానాలను ఆ జనాంగం ఆ తర్వాత అనేక తరాలవరకు అనుభవించింది. విశ్వసనీయులైన ఇశ్రాయేలీయులు కూడా, యథార్థంగా జీవించడాన్ని కష్టభరితం చేసిన ఆ జనాంగపు మతపరమైన అపరాధ ప్రభావాలను అనుభవించారు.
ఆగస్టు 31–సెప్టెంబరు 6
దేవుని వాక్యంలో ఉన్న సంపద|నిర్గమకాండం 21-22
“జీవాన్ని యెహోవా చూసినట్టే చూడండి”
it-1-E 271
కొట్టడం
తన హెబ్రీ దాసుడు లేదా దాసురాలు అవిధేయత చూపిస్తే లేదా తిరుగుబాటు చేస్తే యజమాని వాళ్లను కర్రతో కొట్టవచ్చు. కానీ ఆ దెబ్బలకు దాసుడు చనిపోతే, యజమానికి శిక్ష పడుతుంది. కానీ ఆ దాసుడు దెబ్బలు తిన్న ఒకట్రెండు రోజుల తర్వాత చనిపోతే, ఆ యజమాని అతన్ని చంపాలనే ఉద్దేశంతో కొట్టలేదని సూచిస్తుంది. దాసుడు తన “సొత్తు” కాబట్టి అతనికి క్రమశిక్షణ ఇచ్చి శిక్షించే హక్కు యజమానికి ఉంటుంది. నిజానికి, తన దగ్గరున్న విలువైన ఆస్తిని పూర్తిగా నాశనం చేసుకొని నష్టపోవాలని ఏ వ్యక్తీ కోరుకోడు. అంతేకాదు, ఆ దాసుడు ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ రోజుల తర్వాత చనిపోతే, యజమాని కొట్టడం వల్ల అతను చనిపోయాడా లేక వేరే కారణం వల్లా అనేది చెప్పలేం. కాబట్టి ఆ దాసుడు ఒకట్రెండు రోజులు బ్రతికితే, యజమానికి శిక్ష పడదు.—నిర్గ 21:20, 21.
దేవునిలా ప్రాణాన్ని విలువైనదిగా చూడండి
16 ఇంకా పుట్టని శిశువు ప్రాణంతో సహా ప్రతీ ఒక్కరి ప్రాణం యెహోవాకు విలువైనదే. ఒక వ్యక్తి వల్ల అనుకోకుండా గర్భిణీ స్త్రీకి దెబ్బ తగిలి, ఆమె గానీ ఆమె కడుపులో ఉన్న బిడ్డ గానీ చనిపోతే, యెహోవా ఆ వ్యక్తిని హంతకుడిలా చూస్తాడని ధర్మశాస్త్రం చెప్పింది. అనుకోకుండా జరిగినా, ఒక ప్రాణం పోయింది కాబట్టి ఆ హంతకుణ్ణి చంపేయాలి. (నిర్గమకాండం 21:22, 23 చదవండి.) కడుపులో ఉన్న బిడ్డను కూడా దేవుడు ఒక వ్యక్తిలానే చూస్తాడు. దీన్నిబట్టి గర్భస్రావం విషయంలో దేవుని అభిప్రాయం ఏమైవుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రతీ సంవత్సరం లక్షలమంది పిల్లల్ని కడుపులోనే చంపేస్తుంటే యెహోవాకు ఎలా అనిపిస్తుంది?
మీరు “సురక్షితముగా” ఉండాలని యెహోవా కోరుకుంటున్నాడు
అంతేకాక, పెంపుడు జంతువుల వల్ల హాని జరగకుండా ఉండేందుకు కూడా ధర్మశాస్త్రంలో ఆంక్షలు విధించబడ్డాయి. ఒకవేళ ఓ ఎద్దు కొమ్ములతో పొడవడం వల్ల ఎవరైనా చనిపోతే మళ్లీ అలాంటి హాని ఇతరులకు జరగకుండా ఉండడానికి ఆ ఎద్దు యజమాని దాన్ని చంపేయాలి. దాని మాంసాన్ని తినకూడదు, లేదా ఆహారం కోసం ఇతరులకు దాన్ని అమ్మకూడదు కాబట్టి అలా చంపడంవల్ల యజమాని బాగా నష్టపోతాడు. అయితే ఒకవేళ ఓ ఎద్దు ఎవరికైనా హానిచేసిన తర్వాత కూడా దాని యజమాని దాన్ని కట్టేసి ఉంచకపోతే అప్పుడేమి జరుగుతుంది? అదే ఎద్దు ఆ తర్వాత ఎవరినైనా చంపితే ఈసారి ఆ ఎద్దు, దాని యజమాని చంపబడతారు. ఆ నియమం, పశువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు తమ ప్రవర్తన గురించి ఆలోచించేలా చేసింది.—నిర్గ. 21:28, 29.
దేవుని వాక్యంలో రత్నాలను త్రవ్వితీద్దాం
మీరు యెహోవాకు ఎందుకు సమర్పించుకోవాలి?
4 క్రైస్తవ సమర్పణ గంభీరమైన విషయం. సమర్పించుకోవడం అంటే కేవలం నిబద్ధత చూపించడం మాత్రమే కాదు. మనమిప్పుడు సమర్పణవల్ల వచ్చే ప్రయోజనాలను చూద్దాం. వాటిని అర్థం చేసుకునేందుకు ముందుగా మనం సమర్పణను, నిబద్ధతతో పోల్చుదాం. ఉదాహరణకు, మానవ సంబంధాల్లో నిబద్ధత చూపించడం వల్ల వచ్చే ప్రయోజనాలను పరిశీలిద్దాం. మచ్చుకు, స్నేహం గురించే ఆలోచించండి. స్నేహం వల్ల వచ్చే ప్రయోజనాలు పొందాలంటే దానితోపాటు వచ్చే బాధ్యతను అంగీకరించాలి. అంటే నిబద్ధత చూపించాలి. మీ స్నేహితుని బాగోగులను చూసుకునే బాధ్యత ఉందని మీకు అనిపిస్తుంది. బైబిల్లో ఎంతోమంది మంచి స్నేహితుల గురించి చెప్పబడింది. దావీదు యోనాతానులు అలాంటి స్నేహితులే. తమ స్నేహాన్నిబట్టి వారు ఒక నిబంధన కూడా చేసుకున్నారు. (1 సమూయేలు 17:57; 18:1, 3 చదవండి.) అంతటి నిబద్ధత స్నేహితుల మధ్య అరుదుగా కనిపించినప్పటికీ, స్నేహితులు ఒకరిపట్ల ఒకరికి బాధ్యత ఉన్నట్లు భావించి నిబద్ధత చూపిస్తే వారి స్నేహం వర్ధిల్లుతుంది.—సామె. 17:17; 18:24.
5 ఇశ్రాయేలీయులు నిబద్ధత చూపించడం వల్ల మరో రకమైన బంధంలో కూడా ప్రయోజనం పొందారని దేవుడు వారికిచ్చిన ధర్మశాస్త్రాన్నిబట్టి తెలుస్తుంది. ఒక మంచి యజమానికి ఎల్లప్పుడూ దాసునిగా ఉండాలని ఇష్టపడితే, ఆ దాసుడు తన యజమానితో ఒక శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ధర్మశాస్త్రం ఇలా చెప్పింది: “అయితే ఆ దాసుడు—నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను; నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనొల్లనని నిజముగా చెప్పిన యెడల వాని యజమానుడు దేవుని యొద్దకు వానిని తీసికొని రావలెను, మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొనిపోయి వాని చెవిని కదురుతో గుచ్చవలెను. తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును.”—నిర్గ. 21:5, 6.
it-1-E 1143
కొమ్ము
నిర్గమకాండం 21:14 లోని మాటలు, హత్య చేసిన వ్యక్తి ఒక యాజకుడైనా సరే అతను చంపబడాలని సూచిస్తుండవచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా హత్య చేసిన వ్యక్తి బలిపీఠం కొమ్ముల్ని పట్టుకున్నా సరే చంపబడాలని సూచిస్తుండవచ్చు.—1రా 2:28-34తో పోల్చండి.