-
‘నా ఆజ్ఞల్ని నీవు మనస్సులో ఉంచుకొంటే నీవు బ్రదుకుతావు’కావలికోట—2000 | నవంబరు 15
-
-
“ఉదయము వరకు వలపుదీర తృప్తిపొందుదము రమ్ము” అంటుందామె, “పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము.” ఇద్దరూ కలిసి చక్కని విందునారగించడానికే కాదు ఆ ఆహ్వానం పలికింది. అద్భుతమైన లైంగిక అనుభవం పొందవచ్చన్నదే ఆమె చేస్తోన్న వాగ్దానం. ఆ యువకుడికైతే ఆ విజ్ఞప్తిని మన్నించడం ఎంతో సాహసకృత్యంగా ఉత్తేజకరంగా కన్పిస్తున్నది! ఇది చాలదన్నట్లు ఆయన్ను వశపర్చుకోవడానికి ఆమె ఇంకా ఇలా అంటుంది: “పురుషుడు ఇంట లేడు దూరప్రయాణము వెళ్లియున్నాడు. అతడు సొమ్ముసంచి చేత పట్టుకొని పోయెను. పున్నమనాటివరకు ఇంటికి తిరిగి రాడు.” (సామెతలు 7:18-20) తామిద్దరూ సురక్షితంగా ఉండవచ్చని హామీ ఇస్తుంది, ఎందుకంటే ఆమె భర్త వ్యాపారం నిమిత్తం దూరప్రయాణం వెళ్ళాడు, ఇప్పుడప్పుడే రాడు. ఒక యువకుణ్ణి మోసపుచ్చి వల్లో వేసుకోవడంలో ఎంతటి ప్రజ్ఞను ప్రదర్శించిందీమె! “అది తన అధికమైన లాలనమాటలచేత వానిని లోపరచు కొనెను. తాను పలికిన యిచ్చకపుమాటలచేత వాని నీడ్చుకొని పోయెను.” (సామెతలు 7:21) ఇంతటి మోహపు మాటలకు నిలద్రొక్కుకోవాలంటే యోసేపు అంతటి సద్గుణసంపన్నుడే సరియైనవాడు. (ఆదికాండము 39:9, 12) ఈ యువకుడిలో అంతటి బలం ఉందా?
-
-
‘నా ఆజ్ఞల్ని నీవు మనస్సులో ఉంచుకొంటే నీవు బ్రదుకుతావు’కావలికోట—2000 | నవంబరు 15
-
-
సొలొమోను చూసిన ఆ “పరస్త్రీ,” “పరస్పరమోహముచేత చాలా సంతుష్టి నొందుదము రమ్ము” అనే ఆహ్వానంతో ఆ యౌవనస్థుణ్ణి వలలో వేసుకుంది. అనేకమంది యౌవనస్థులు—ప్రత్యేకంగా అమ్మాయిలు—అదే పద్ధతిలో మోసపోలేదా? కానీ ఒక్కసారి ఆలోచించండి: ఎవరైనా మిమ్మల్ని లైంగిక అనైతికతలో పడవేసేందుకు ప్రయత్నించినప్పుడు, అది నిజమైన ప్రేమతోనా లేదా స్వార్థంతో కూడిన కామోద్రేకంతోనా? ఒక స్త్రీని నిజంగా ప్రేమించే పురుషుడు, ఆమె తన క్రైస్తవ శిక్షణను క్రైస్తవ మనస్సాక్షిని అతిక్రమించేలా ఎందుకు ఒత్తిడి చేస్తాడు? అలాంటి మార్గాలతట్టు “నీ మనస్సు తొలగనియ్యకుము” అని సొలొమోను హెచ్చరిస్తున్నాడు.
-