కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”
    కావలికోట—1999 | నవంబరు 15
    • ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన జ్ఞానవంతుడైన సొలొమోను రాజు, ఒక ప్రేమగల తండ్రి చెప్పినట్లు ఇలా చెప్తున్నాడు: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.”—సామెతలు 2:1-5.

  • “యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”
    కావలికోట—1999 | నవంబరు 15
    • జ్ఞానానికి చెవి యొగ్గడం, వివేచననూ అవగాహననూ సంపాదించుకోవడానికి దోహదపడుతుంది. వెబ్స్‌టర్స్‌ రివైజ్డ్‌ అనబ్రిడ్జడ్‌ డిక్షనరి ప్రకారం, వివేచన అంటే, “ఒక విషయం నుండి మరో విషయాన్ని వేరు చేయగలిగేలా మెదడుకున్న శక్తి లేక సామర్థ్యం.” తప్పేదో ఒప్పేదో గ్రహించి, సరైన మార్గాన్ని ఎన్నుకునే సామర్థ్యమే దైవిక వివేచన. మనం వివేచనను ‘హృదయపూర్వకంగా అభ్యసించకపోతే’ లేదా ఆత్రంగా దాన్ని సంపాదించుకోకపోతే, మనం ‘జీవానికి నడిపే మార్గంపై’ ఎలా నిలిచివుండగలం? (మత్తయి 7:13-14; పోల్చండి ద్వితీయోపదేశకాండము 30:19, 20.) దేవుని వాక్యాన్ని పఠించి, అన్వయించుకోవడం వివేచననిస్తుంది.

      ‘తెలివికై’ అంటే ఒక విషయానికి సంబంధించిన అంశాలు ఒకదానితో ఒకటీ, అలాగే మొత్తం అంశంతోనూ ఎలా సంబంధం కల్గివున్నాయో గ్రహించే సామర్థ్యానికై మనమెలా ‘మొఱ్ఱపెట్టవచ్చు’? అయితే, అధికమైన అవగాహనను పెంపొందింపజేసుకోవడానికి సహాయపడే కారకాలు వయస్సు, అనుభవము. కానీ అవి తప్పనిసరిగా అలా అయ్యుండనవసరం లేదు. (యోబు 12:12; 32:6-12) “నీ [యెహోవా] ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను కావున వృద్ధులకంటె నాకు విశేషజ్ఞానము కలదు” అని కీర్తన గ్రంథకర్త అన్నాడు. ఆయనింకా ఇలా పాడాడు: “నీ వాక్యములు వెల్లడి అగుటతోడనే వెలుగుకలుగును అవి తెలివిలేనివారికి తెలివి కలిగించును.” (కీర్తన 119:100, 130) యెహోవా ‘మహావృద్ధుడు,’ మానవజాతికంతటికీ ఉన్న వివేచనకంటే అపరిమితమైన వివేచన ఆయనకుంది. (దానియేలు 7:13) దేవుడు తెలివిలేని వారికి వివేచననిచ్చి, వయస్సులో పెద్దవారికంటే అధికమైన వివేచన కల్గివుండేలా చేయగలడు. కాబట్టి, దేవుని వాక్యమైన బైబిలును పఠించి, అన్వయించుకోవడంలో మనం అత్యంత శ్రద్ధ కల్గివుండాలి.

      సామెతల గ్రంథంలోని రెండవ అధ్యాయం ప్రారంభ భాగంలో ‘అంగీకరించిన,’ ‘దాచుకున్న,’ ‘మొఱ్ఱపెట్టిన,’ ‘వెదకిన’ వంటి పదాల తర్వాత “యెడల” అన్న మాట పదేపదే వచ్చింది. రచయిత అత్యధిక తీవ్రతగల ఈ పదాలను ఎందుకు ఉపయోగించాడు? ఒక పుస్తకం ఇలా తెలియజేస్తుంది: “జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఉండవలసిన అత్యంతాసక్తిని ప్రాజ్ఞుడు [ఇక్కడ] నొక్కి చెప్తున్నాడు.” అవును, మనం జ్ఞానాన్నీ, దాని సంబంధిత లక్షణాలైన వివేచనను, అవగాహనను అత్యంతాసక్తితో వెంటాడాలి.

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి