-
“యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”కావలికోట—1999 | నవంబరు 15
-
-
ప్రాచీన ఇశ్రాయేలుకు చెందిన జ్ఞానవంతుడైన సొలొమోను రాజు, ఒక ప్రేమగల తండ్రి చెప్పినట్లు ఇలా చెప్తున్నాడు: “నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల వెండిని వెదకినట్లు దాని వెదకిన యెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.”—సామెతలు 2:1-5.
-
-
“యెహోవాయే జ్ఞానమిచ్చువాడు”కావలికోట—1999 | నవంబరు 15
-
-
సామెతల గ్రంథంలోని రెండవ అధ్యాయం ప్రారంభ భాగంలో ‘అంగీకరించిన,’ ‘దాచుకున్న,’ ‘మొఱ్ఱపెట్టిన,’ ‘వెదకిన’ వంటి పదాల తర్వాత “యెడల” అన్న మాట పదేపదే వచ్చింది. రచయిత అత్యధిక తీవ్రతగల ఈ పదాలను ఎందుకు ఉపయోగించాడు? ఒక పుస్తకం ఇలా తెలియజేస్తుంది: “జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఉండవలసిన అత్యంతాసక్తిని ప్రాజ్ఞుడు [ఇక్కడ] నొక్కి చెప్తున్నాడు.” అవును, మనం జ్ఞానాన్నీ, దాని సంబంధిత లక్షణాలైన వివేచనను, అవగాహనను అత్యంతాసక్తితో వెంటాడాలి.
మీరు తగిన కృషి చేస్తారా?
జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ప్రముఖ అంశం శ్రద్ధతో బైబిలు అధ్యయనం చేయడం. అయితే ఈ అధ్యయనం, ఏదో కేవలం సమాచారం కోసం చదవడం కన్నా ఎంతో ఎక్కువే అయ్యుండాలి. లేఖనాలను అధ్యయనం చేయడంలో మనం చదివేదాన్ని సంకల్పవంతంగా ధ్యానించడం ముఖ్యమైన భాగం. జ్ఞానవివేచనలను సంపాదించుకోవడంలో, మనం నేర్చుకుంటున్నదాన్ని సమస్యలను పరిష్కరించుకోవడంలోనూ, నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఎలా ఉపయోగించవచ్చుననేదాని గురించి ఆలోచించడం ఇమిడివుంటుంది. అవగాహనను సంపాదించుకోవడానికి, మనకు ఇప్పటికే తెలిసినదానికి, క్రొత్త సమాచారం ఎలా సరిపోతుందనేదాని గురించి ఆలోచించడమవసరం. బైబిలును అలా ఆలోచనాపూర్వకంగా అధ్యయనం చేయడానికి సమయమూ శక్తివంతమైన ప్రయత్నమూ అవసరమన్న విషయాన్ని ఎవరు కాదంటారు? అందుకు వెచ్చించే సమయమూ, శక్తీ ‘వెండి కోసం, దాచబడిన ధనం కోసం వెదికేటప్పుడు’ వెచ్చించే వాటివంటివే. మీరు అవసరమైనంతగా కృషి చేస్తారా? అలా చేయడానికి కావలసిన ‘సమయాన్ని మీరు సద్వినియోగం’ చేసుకుంటారా?—ఎఫెసీయులు 5:15, 16.
-