-
ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన గ్రంథంసర్వమానవాళి కొరకైన గ్రంథం
-
-
కానీ తల్లిదండ్రుల అధికారాన్ని—‘శిక్షాదండాన్ని’—ఎన్నడూ దుర్వినియోగం చేయకూడదు.b (సామెతలు 22:15; 29:15) తల్లిదండ్రుల్ని బైబిలు ఇలా హెచ్చరిస్తోంది: “మీ పిల్లలను అతిగా సరిదిద్దకండి లేకపోతే వాళ్ల ధైర్యం నిర్వీర్యమైపోయేలా చేస్తారు.” (కొలొస్సయులు 3:21, ఫిలిప్స్) భౌతికంగా శిక్షించడమనేది సాధారణంగా ప్రతిభావంతమైన బోధనా పద్ధతి కాదని కూడా అది అంగీకరిస్తోంది. సామెతలు 17:10 ఇలా చెబుతోంది: “బుద్ధిహీనునికి నూరు దెబ్బలు నాటునంతకంటె బుద్ధిమంతునికి ఒక గద్దింపుమాట లోతుగా నాటును.” అంతేగాక, నివారణా శిక్షణను బైబిలు సిఫారసు చేస్తోంది. ద్వితీయోపదేశకాండము 11:19 నందు, తమ పిల్లల్లో నైతిక విలువల్ని నాటేందుకు తల్లిదండ్రులు మామూలు సమయాల్ని ఉపయోగించుకోవాలని వారికి ఉపదేశించబడింది.—ద్వితీయోపదేశకాండము 6:6, 7 కూడా చూడండి.
-
-
ఆధునిక జీవనానికి ఆచరణాత్మకమైన గ్రంథంసర్వమానవాళి కొరకైన గ్రంథం
-
-
b బైబిలు కాలాల్లో, “దండము” అనే పదానికి (హెబ్రీ షీవత్) గొఱ్ఱెల కాపరి ఉపయోగించేలాంటి “కర్ర” లేక “చేతికర్ర” అని భావం ఉండేది.10 ఈ సందర్భంలో శిక్షాదండం, ప్రేమపూర్వకమైన నడిపింపును సూచిస్తుందిగానీ కఠినమైన క్రూరత్వాన్ని కాదు.—కీర్తన 23:4 పోల్చండి.
-