-
మీ బలాన్ని ఉపయోగించడంలో ‘దేవునిపోలి నడుచుకోండి’యెహోవాకు సన్నిహితమవండి
-
-
10.(ఎ)తల్లిదండ్రులకు దేవుడెలాంటి అధికారమిచ్చాడు? (బి) “శిక్ష” అనే మాటకు అర్థమేమిటి, దానినెలా ఇవ్వాలి? (అధస్సూచి కూడా చూడండి.)
10 తల్లిదండ్రులకు కూడా దేవుడిచ్చిన అధికారముంది. బైబిలిలా ప్రబోధిస్తోంది: “తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.” (ఎఫెసీయులు 6:4) బైబిల్లో “శిక్ష” అనే మాటకు “పెంచడం, శిక్షణ ఇవ్వడం, ఉపదేశించడం” అనే భావాలున్నాయి. పిల్లలకు క్రమశిక్షణ అవసరం; ఖచ్చితమైన నిర్దేశాలు, హద్దులు, పరిమితులుంటే వారు వర్ధిల్లుతారు. అలాంటి క్రమశిక్షణను లేదా ఉపదేశాన్ని బైబిలు ప్రేమకు ముడిపెడుతోంది. (సామెతలు 13:24) అందువల్ల, ఆ ‘శిక్షాదండాన్ని’ భావోద్వేగపరంగా లేదా శారీరకంగా ఎన్నటికీ దుర్వినియోగం చెయ్యకూడదు.a (సామెతలు 22:15; 29:15) ప్రేమ అనేదే లేకుండా కఠినంగా లేదా క్రూరంగా శిక్షించడం తల్లిదండ్రులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది, అంతేకాక అది పిల్లవాని మనస్సును గాయపరుస్తుంది. (కొలొస్సయులు 3:21) మరోవైపున, సరైన రీతిలో సమతుల్యంగా ఇవ్వబడే క్రమశిక్షణ తల్లిదండ్రులు తమను ప్రేమిస్తున్నారనీ తామెలాంటివారిగా తయారుకావాలనే విషయంలో వారు శ్రద్ధ చూపిస్తున్నారనీ పిల్లలు గ్రహించేలా చేస్తుంది.
-
-
మీ బలాన్ని ఉపయోగించడంలో ‘దేవునిపోలి నడుచుకోండి’యెహోవాకు సన్నిహితమవండి
-
-
a బైబిలు కాలాల్లో, “దండము” అని అనువదించబడిన హీబ్రూ పదానికి గొఱ్ఱెలు తోలడానికి గొఱ్ఱెలకాపరి చేతిలో ఉండేటువంటి దుడ్డుకఱ్ఱ లేదా కొయ్య అని అర్థం. (కీర్తన 23:4) అదే ప్రకారంగా, తల్లిదండ్రుల అధికార “దండము” ప్రేమపూర్వక నిర్దేశాన్ని సూచిస్తుందే తప్ప క్రూరమైన, పశుప్రాయమైన శిక్షను సూచించడం లేదు.
-