కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • “నా జనులను ఓదార్చుడి”
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
    • 12, 13. (ఎ) పునఃస్థాపన వాగ్దానాన్ని ఎందుకు నమ్మవచ్చు? (బి) యూదా పరవాసుల కోసం ఏ సువార్త ఉంది, వారు ఎందుకు నమ్మకం కలిగి ఉండవచ్చు?

      12 పునఃస్థాపన వాగ్దానాన్ని ఎందుకు నమ్మవచ్చుననే దానికి యెషయా రెండవ కారణాన్ని ఇస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని చేస్తున్నది తన ప్రజల గురించి ప్రేమపూర్వకంగా శ్రద్ధ తీసుకునే శక్తివంతుడైన దేవుడు. యెషయా ఇలా కొనసాగిస్తున్నాడు: “సీయోనూ, సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నతపర్వతము ఎక్కుము. యెరూషలేమూ, సువార్త ప్రకటించుచున్నదానా, బలముగా ప్రకటించుము. భయపడక ప్రకటింపుమి​—⁠ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించుము. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభువగు యెహోవా తానే శక్తిసంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయనయొద్ద నున్నది, ఆయన చేయు ప్రతికారము ఆయనకు ముందుగా నడచుచున్నది. గొఱ్ఱెలకాపరివలె ఆయన తన మందను మేపును. తన బాహువుతో గొఱ్ఱెపిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును. పాలిచ్చువాటిని ఆయన మెల్లగా నడిపించును.”​—⁠యెషయా 40:9-11.

      13 బైబిలు కాలాల్లో, గెలిచిన యుద్ధాలను గురించిన లేక రాబోతున్న ఉపశమనాన్ని గురించిన సువార్తను స్త్రీలు ఎలుగెత్తి చెబుతూ లేక పాడుతూ విజయాలను పండుగగా చేసుకోవడం ఆనవాయితీగా ఉండేది. (1 సమూయేలు 18:6, 7; కీర్తన 68:​11) యూదా పరవాసుల కోసం ఒక సువార్త అంటే చివరికి పర్వతాగ్రాలపై నుండి నిర్భయంగా ఎలుగెత్తి చెప్పగల వార్త ఉందని యెషయా ప్రవచనార్థకంగా సూచిస్తున్నాడు. యెహోవా తన ప్రజలను తమ ప్రియమైన యెరూషలేముకు తిరిగి తీసుకువెళతాడన్నదే ఆ సువార్త! వారు నమ్మకం కలిగివుండవచ్చు, ఎందుకంటే యెహోవా “శక్తిసంపన్నుడై” వస్తాడు. కాబట్టి, ఆయన తన వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఏదీ ఆయనను ఆపలేదు.

  • “నా జనులను ఓదార్చుడి”
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
    • 15. (ఎ) యెహోవా “శక్తిసంపన్నుడై” ఎప్పుడు వచ్చాడు, ‘ఆయన పక్షమున ఏలుచున్న బాహువు’ ఎవరు? (బి) ఏ సువార్త నిర్భయంగా ప్రకటించబడాలి?

      15 యెషయా మాటలు, మన కాలం కోసం ప్రవచనార్థక భావంతో నిండివున్నాయి. యెహోవా 1914 లో, “శక్తిసంపన్నుడై” వచ్చి, పరలోకంలో తన రాజ్యాన్ని స్థాపించాడు. ‘ఆయన పక్షమున ఏలుచున్న బాహువు’ ఆయన కుమారుడైన యేసు క్రీస్తు, ఆయనను యెహోవా తన పరలోక సింహాసనంపై అధిష్ఠింపజేశాడు. యెహోవా 1919 లో, భూమిపైనున్న తన అభిషిక్త సేవకులను మహాబబులోను దాసత్వం నుండి విడిపించి, జీవముగల సత్య దేవుడైన తన స్వచ్ఛారాధనను పూర్తిగా పునఃస్థాపించడానికి పూనుకున్నాడు. ఇది, చేయబడుతున్న ప్రకటన దూరతీరాలకు చేరగలిగేలా పర్వతాగ్రాలపై నుండి ఎలుగెత్తి ప్రకటిస్తున్నట్లుగా, నిర్భయంగా ప్రకటించవలసిన సువార్త. కాబట్టి మనం మన స్వరములెత్తి, యెహోవా దేవుడు ఈ భూమిపై తన స్వచ్ఛారాధనను పునఃస్థాపించాడని ఇతరులకు ధైర్యంగా తెలియజేద్దాము!

తెలుగు ప్రచురణలు (1982-2026)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి